Devineni Avinash : ఐటీ రైడ్స్ మీద దేవినేని అవినాష్ ఊహించని వ్యాఖ్యలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Devineni Avinash : ఐటీ రైడ్స్ మీద దేవినేని అవినాష్ ఊహించని వ్యాఖ్యలు..!

Devineni Avinash : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పోరు అన్నట్టుగా నడిచిన విషయం తెలిసిందే. ఐటీ అధికారులు తెలంగాణలో వరుసగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న జరిగిన ఐటీ తనిఖీల్లో భాగంగా ఆ సంస్థతో సంబంధం ఉన్న, లావాదేవీలు జరిపిన వైసీపీ నేత దేవినేని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 December 2022,7:30 pm

Devineni Avinash : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పోరు అన్నట్టుగా నడిచిన విషయం తెలిసిందే. ఐటీ అధికారులు తెలంగాణలో వరుసగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న జరిగిన ఐటీ తనిఖీల్లో భాగంగా ఆ సంస్థతో సంబంధం ఉన్న, లావాదేవీలు జరిపిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడలో ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో అవినాష్ ను కూడా అధికారులు చాలా సేపు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.దేవినేని అవినాష్.. అధికార వైఎస్సార్సీపీ పార్టీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఉన్నాడు. ఆయన ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 6 వరకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే.. ల్యాండ్ డెవలప్ మెంట్ ఒప్పందంపై వంశీరామ్ బిల్డర్స్ తో అవినాష్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపైనే అధికారులు అవినాష్ ను కూడా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు తెలిపారు.

Devineni Avinash reaction on it raids

Devineni Avinash reaction on it raids

Devineni Avinash : మా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం లాంటిది

ఐటీ శాఖ అధికారుల కోసం నేను పూర్తిగా సహకరించాను. మా జీవితాలు తెరిచిన తెల్ల పుస్తకాల్లాంటివి. ప్రజలే మాకు ఆస్తులు. మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దేవినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే కదా. మేము నిత్యం ప్రజల్లో ఉంటాం.. రాజకీయాలు చేయడం మాత్రమే మాకు తెలుసు. సాధారణమైన తనిఖీ మాత్రమే ఇది. ఈ సోదాల్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదు.. అంటూ దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది