Chandrababu : వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోబోతోందని చంద్రబాబుకు ముందే తెలిసిందా?
Chandrababu : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు అయితే ఇప్పటి నుంచే ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు తహతహలాడుతున్నాయి. ఈ సారి రెండు పార్టీలకు గెలుపు అవసరం. ఏ పార్టీ ఓడిపోయినా.. ఇక ఆ పార్టీ రాజకీయంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ముఖ్యంగా టీడీపీ పార్టీ అయితే గెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలవకపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటి.. అనే విషయం ముందే చంద్రబాబు తెలుసుకునే పనిలో పడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. చాలామంది నేతలు పార్టీలు మారారు. ఒకవేళ మళ్లీ 2024 లో టీడీపీ ఓడిపోతే ఇక పరిస్థితి దారుణంగా ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరని చంద్రబాబు ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో చెప్పుకొచ్చారు.
Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరన్న చంద్రబాబు
టీడీపీ గెలవడం పార్టీ కోసం కాదు.. తన కోసం కాదు.. రాష్ట్ర అవసరం కోసం అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓడిపోతే పరిస్థితి అలాగే ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారా? ఇటీవల కర్నూలులోనూ ఇవే నాకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఎందుకు చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.