Operation Mangalagiri : తెలుగుదేశం పార్టీకి 2024 లో ఉన్న ఒకే ఒక్క ఆశను కూడా పాతిపెట్టేసిన వైఎస్ జగన్
Operation Mangalagiri : ఇంకో రెండేళ్లలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పలు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ అధినేత జగన్ కు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క టార్గెట్ టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీని తొక్కిపడేసి సీఎంగా గెలిచిన వైఎస్ జగన్, ఈసారి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కునేలా పథకాలు రచిస్తున్నారట. ఇప్పటికే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఓడిపోయేలా పథకాలు రచించి సక్సెస్ అయ్యాడు జగన్. తాజాగా వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ ను ఓడించేందుకు వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికోసమే ఆయన ఆపరేషన్ మంగళగిరిని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Operation Mangalagiri : ఓవైపు కుప్పం.. మరోవైపు మంగళగిరి
ఓవైపు కుప్పం నియోజకవర్గంలోనూ ఈసారి చంద్రబాబును ఓడించేందుకు ప్లాన్స్ వేసిన జగన్.. మరోవైపు మంగళగిరిలోనూ లోకేశ్ ను ఓడించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి చూపు పడటానికి కారణం రాజధాని అమరావతికి ఆ నియోజకవర్గం దగ్గరగా ఉండడం. రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు అక్కడ ఉన్న ఓటర్లలో ఎక్కువ శాతం పద్మశాలీ ఓట్లే ఉన్నాయి. పద్మశాలీ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కేవలం పద్మశాలీలను తమ వైపునకు తిప్పుకున్నా చాలు గెలపు ఎవరిదైనా సులువు అవుతుంది. అందుకోసమే.. పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆప్కో చైర్మన్ పదవిని వైఎస్ జగన్ కట్టబెట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మరో నేత మురుగుడు హన్మంతరావుకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు.
ఇద్దరు పద్మశాలి నేతలకు పదవులు ఇవ్వడంతో కొంతమేర పద్మశాలి నేతలు తన వైపునకు తిరిగినట్టే. ఇది ఇలా ఉంటే టీడీపీకి చెందిన గంజి చిరంజీవి టీడీపికి రాజీనామా చేశాడు. ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలోనూ చేరకున్నా.. ఆయన వైసీపలోనే చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూడా వైసీపీలో చేరితే ఇకేంముంది మంగళగిరి నియోజకవర్గం మరోసారి వైసీపీ చేతికి చిక్కినట్టే. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే.. గంజి చిరంజీవి వైసీపీలో చేరితే గంజికే వైసీపీ నుంచి మంగళగిరి టికెట్ దొరికే అవకాశం ఉంది. చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఉన్న ఒక ఆశను కూడా జగన్ మటుమాయం చేస్తారో చేయరో.