YS Jagan : జగన్ వేసిన ఉచ్చులో కరక్ట్ గా వచ్చి పడిన పవన్ కళ్యాణ్ + చంద్రబాబు
YS Jagan : ఏపీ రాజధాని అంశం ఇంకా ఒక కొలిక్కి వచ్చేలా లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉన్నప్పటికీ.. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. రాజధాని అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వేసే వ్యూహానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అటు చంద్రబాబు కానీ.. ఇటు జగన్ కానీ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు. మూడు రాజధానుల అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు.
అంతే కాదు.. వాళ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్న అమరావతి రాజధాని అంశంపై కూడా స్పష్టతను ఇవ్వడం లేదు. అసలు అమరావతినే ఎందుకు రాజధానిగా ఉంచాలి.. అని అడిగితే ఏం చెప్పాలో వాళ్ల దగ్గర సమాధానం కూడా లేదు. డైరెక్ట్ గా ఎందుకు అమరావతిని రాజధానిగా ఉంచాలో చెప్పలేక ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ మాత్రం తన విజన్ పై క్లారిటీగా ఉన్నారు. మూడు రాజధానుల అంశాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. తను ఎందుకు మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నారో కూడా అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీకి ఎంత అన్యాయం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

did ys jagan trap chandrababu and pawan kalyan on capital issue
YS Jagan : మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోంది అందుకే అన్న జగన్
ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఏపీకి చాలా అన్యాయం జరిగింది. అది మరీ రిపీట్ కాకూడదంటే.. ఏపీకి ఖచ్చితంగా మూడు రాజధానులు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అందుకే వైజాగ్, కర్నూలు, అమరావతిని రాజధానులుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరి.. జగన్ ప్రతిపాదన తప్పు అని కానీ.. అది కరెక్ట్ కాదని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడే మూడు రాజధానుల అంశంపై స్పష్టంగా చెప్పలేకపోతే.. రేపు ఎన్నికల్లో ఎలా జనాలను వీళ్లు ఓట్లడుగుతారు అంటూ పలువురు రాజకీయవేత్తలు ప్రశ్నిస్తున్నారు.