Home » News » Dil Raju Stops Shooting For Film Industry Problems
News

Dil Raju : షూటింగ్‌ ఆగినంత మాత్రాన సమస్యల పరిష్కారం ఎలా అవుతుంది రాజు గారు?

Authored By
aruna
The Telugu News | Updated on: August 2, 2022 8:12 pm
Advertisement

Dil Raju : టాలీవుడ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతల మండలికి సంబంధించిన కొందరు నిర్మాతలు ముందుకు వచ్చి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాతల మండలి నుండి పలువురు నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆగస్టు ఒకటో తారీకు నుండి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన హడావుడి ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. షూటింగ్లు లేక పోవడంతో సినీ కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న సినిమా ఇండస్ట్రీకి షూటింగ్ నిలిపి వేయడం ద్వారా సమస్యలు పరిష్కారం ఎలా జరుగుతాయో చెప్పాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సినీ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో షూటింగ్ నిలిపి వేయడం ద్వారా వారికి లేని పోని కష్టాలు తెచ్చిపెట్టినట్లు అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి అనేది నిజమే.. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలి. అంతే తప్ప షూటింగ్ లు నిలిపి వేయడం ద్వారా సాధించేది ఏంటి అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దలు మరియు మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

Dil Raju stops shooting for film industry problems

Advertisement

ఈ విషయంలో దిల్ రాజు ముందుండి నడిపిస్తున్నాడు అని.. ఆయన షూటింగ్స్ ను ఆపించడం ద్వారా ఏం సాధించాడో చెప్పాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దిల్ రాజు ఈ మధ్య కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారని.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కూడా సరైనది కాదంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ షూటింగ్ లను నిలిపి వేయడం అనేది కేవలం దిల్‌ రాజు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదని.. అందరు సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా గుర్తించాలని దిల్‌ రాజు సన్నిహితులు అంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి