Diwali : దీపావళి రోజు రాత్రి చీపురు కింద ఈ వస్తువులు దాచి పెట్టండి చాలు… ఇక మీకు తిరిగి ఉండదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali : దీపావళి రోజు రాత్రి చీపురు కింద ఈ వస్తువులు దాచి పెట్టండి చాలు… ఇక మీకు తిరిగి ఉండదు…!

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Diwali : దీపావళి రోజు రాత్రి చీపురు కింద ఈ వస్తువులు దాచి పెట్టండి చాలు...

  •  దీపావళి రోజు ఇక మీకు తిరిగి ఉండదు...!

Diwali : దీపావళి రోజున లక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని భక్తుల మీద కురిపిస్తుంది. అయితే ఈరోజు దీపావళి పండుగ‌ చీపురు సహాయంతో మాత లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో మనం తెలుసుకుందాం.. చీపిరిని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారని విషయం మనందరికీ తెలుసు.. చీపురుకు సంబంధించి చాలా శుభ మరియు అశుభ శకునాలు ఉన్నాయి. అయితే అసలు మనం చీపురు ఎక్కడ ఎలా ఉంచాలి? ఎప్పుడు కొనాలి.. చీపురు కింద ఏం ఉంచాలి. వీటి గురించి మీకు ఈరోజు వివరిస్తాను.. దీపావళి రోజున ఈ తప్పును అస్సలు చేయకండి.. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పించిన వాళ్ళు అవుతారు. ఎక్కడపడితే ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా కాకుండా కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే చీపురుని ఉపయోగించాలి. సూర్యాస్తమయం తర్వాత చెత్తను బయట వేయకండి. రాత్రి పడుకునే ముందు నేను చెప్పే వాటిని అన్నిటినీ పాటించడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఇంటిని చీపురుతో ఊడ్చేటప్పుడు సరిగ్గా చెత్తను బయటకు ఉడవరు.. అలా చేస్తే ఇళ్లంతా దుర్గంధపరితంగా ఉంటుంది. ఇంట్లోనేఏదో ఒక మూలకు ఏదైనా గోడ వైపుకు చెత్తను పెట్టండి.

రాత్రి పూట ఈ చెత్తను బయటకు విసిరేయడం అస్సలు చేయకూడదు. ఉదయం అయిన తర్వాత మాత్రమే ఇంటి నుండి చెత్తను బయట పడేయండి. దీపావళి నాడు తప్పనిసరిగా చీపురు కొనాలి. ఇది చాలా శుభప్రదమైనది.. మరియు ఈ రోజున మీరు మీ పాత చీపురును బయటకు విసిరివేయలి. దీపావళి రాత్రి ముందుగా మీ ఇంటి నుండి పాత చీపురును విసిరివేసి ఆ రోజు మీరు కొన్న కొత్త చీపురు మాత్రమే ఉపయోగించండి. ఇదే ఉత్తమ సమయం ఇది మీ జీవితానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది. మరియు మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా చీపురుని బహిరంగంగా ఉంచకూడదు. చాలామంది పైకప్పు మీద చీపురు ఉంచుతూ ఉంటారు. కానీ అది కూడా సరైనది కాదు. మీ జీవితంలో కష్టాలను రెట్టింపు చేస్తుంది. ఎందుకంటే మీరు చీపురును బహిరంగంగా ఉంచినప్పుడు జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. అందుకే మీరు మీ ఇంట్లో చీపురును వాయుదిశగా ఉంచడం మర్చిపోవద్దు.. ఈ దీపావళి రోజు రాత్రి తప్పక ఆచరించండి. మీరు ఎవరైనా పేదవారికి ఇంటికి వెళ్లి దీపం వెలిగించండి. ఆ పేదవాడికి బట్టలు డబ్బు మరియు మిఠాయిలు ఇచ్చి సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల శని, రాహువు, కేతువు ఇలా ఏ గ్రహమైన దాని దోషాలు నశించి చేసే పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి.

దీపావళి రోజున మీరు లక్ష్మీదేవి వినాయకుడితో పాటు కుబేర స్వామిని పూజిస్తే ఎంతో మంచిది. దీపావళి రాత్రి మీరు దేవీ సూక్తులను మరియు శ్రీ సూక్తులను 11 సార్లు పఠించాలి. మీకు కావాలంటే శ్రీ సూక్తిని ఐదు లేదా 11 సార్లు పటిచండి. ఈరోజు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించాలి. మీరు ఈరోజు దక్షిణావత శంఖం గోమతి చక్రం పసుపు, కౌరీలు, శ్రీ యంత్రం పసుపు, ముద్దలు, కొత్తిమీర గింజలు మొదలైన వాటిని తప్పనిసరిగా పూజలో ఉంచాలి. ఒకవేళ మీరు ఇవన్నీ ఈరోజు చేయడం మర్చిపోతే మళ్ళీ నవంబర్ లాభపంచమి వస్తుంది. ఆ రోజు మీరు ఈ పనిని ఉదయం 6:41 నిమిషాల నుండి పది గంటల వరకు చేయవచ్చు.. అంటే ఈ శుభ సమయంలో మీరు లక్ష్మీదేవి పాదాల వద్ద వీటిలో దేనినైనా సమర్పించవచ్చు. ఈ ధన త్రయోదశి నాడు మీరు. మేము చెప్పినట్టుగా చేసి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని ఆశిస్తున్నాము. దీపావళి అంటేనే చెడుపై మంచి గెలిచిన రోజు కాబట్టి మీరు తప్పనిసరిగా మేము చెప్పినవి చేసి మీ ఇంట్లో నుంచి పేదరికం బయటకు పంపి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది