SmartPhone : స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీకు కష్టాలు తప్పవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SmartPhone : స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీకు కష్టాలు తప్పవు

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 June 2022,2:30 pm

SmartPhone : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు ఉండరు.. చదువుతో సంబంధం లేకుండా.. కూలీ పని చేసుకునేవాళ్లు కూడా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు చాలా చవకగా మారడం.. ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అవసరం అయింది. అది లేకుంటే రోజు గడవడం లేదు. చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి. చాలా సెన్సిటివ్ డేటా ఫోన్ లో ఉంటుంది కాబట్టి.. ఒకవేళ ఫోన్ పోతే.. లేదా ఎవరైనా దొంగలిస్తే ఎలా. మన ఫోన్ మనకు తిరిగి వస్తుందా? ఆ ఫోన్ లోని ముఖ్యమైన సమాచారాన్ని ఎవరైనా దొంగలిస్తే.. అప్పుడు ఏం చేయాలి.. అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. వాటన్నింటికి సమాధానమే ఈ కథనం.మీ ఫోన్ కనిపించకపోతే వెంటనే వేరే ఫోన్ నుంచి మీ ఫోన్ కు ఫోన్ చేయండి. ఎందుకంటే.. ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోన్ ను మరిచిపోతుంటాం.

అందుకే.. ముందు ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఎవరూ ఆన్సర్ చేయలేదు అంటే.. ఫోన్ ఎక్కడో మిస్ అయినట్టే.. ఒకవేళ ఎవరైనా ఆన్సర్ చేస్తే.. వాళ్లు చెప్పిన అడ్రస్ కు వెళ్లి ఫోన్ ను తెచ్చుకోవచ్చు.ఫోన్ మిస్ అయింది అని కన్ ఫమ్ అయితే.. వెంటనే మీ సిమ్ కార్డు నెట్ వర్క్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసి వెంటనే ఆ ఫోన్ నుంచి ఔట్ గోయింగ్ కాల్స్ ను బ్లాక్ చేయమని చెప్పాలి. ఆ తర్వాత టెక్నాలజీ సాయంతో మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఆనే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ లో ఉండి.. గూగుల్ అకౌంట్ తో లింక్ అయి ఉంటే కనుక.. వెంటనే మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దాని కోసం.. మీరు వేరే ఫోన్ లో మీ గూగుల్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. జీ మెయిల్ తో లాగిన్ అయ్యాక.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. మీ ఫోన్ లొకేషన్ ను చూపిస్తుంది.

Do this as soon as the smartphone is gone

Do this as soon as the smartphone is gone

SmartPhone : వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయండి

అయితే.. మీ ఫోన్ లో జీపీఎస్, ఇంటర్నెట్ ఆన్ లో ఉంటేనే కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మాత్రం ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాను మాత్రమే చూపిస్తుంది. అలాగే.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ద్వారా.. పోయిన మీ ఫోన్ కు లాక్ కూడా వేసుకోవచ్చు. మెసేజ్ కూడడా పంపించవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫోన్ మాత్రం దొరికే చాన్స్ లేకపోతే.. ఆ ఫోన్ లో ఉన్న డేటాను కూడా తీసేయొచ్చు. అలాగే.. మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను కూడా బ్లాక్ చేయాలి. దాని కోసం www.ceir.gov.in/Home/index.jsp అనే వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీ ఫోన్ పోయినట్టుగా ఫిర్యాదు ఇవ్వండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎందుకంటే.. మీ ఫోన్ ను ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించినా కూడా మీరు ప్రమాదంలో పడకుండా మీ ఫిర్యాదు మిమ్మల్ని కాపాడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది