పచ్చి బఠానీలు ఎక్కువగా వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా లాంటి వాటిలో ఎక్కువగా తీసుకుంటాం. ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. చూడడానికి చిన్నగా వున్నాయి కదా అని వాటిని చిన్న చూపు చూడకండి. ఇలాంటి చిన్న చిన్న బఠానీలతో అనేక లాభాలు ఉన్నాయి.
పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే వరకూ అన్ని చర్యలను సహాయపడే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి.
బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు ఇది మంచి ఆహారం అనే చెప్పాలి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.
పచ్చి బఠాణీలు తినటం వలన జీర్ణక్రియ పక్రియ బాగా జరుగుతుంది.
అయితే వీటిని వంటసోడా, మాంసాహారం, మసాలా దినుసులతో కలిపి ఉడికించడకుండా ఎక్కువగా కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ మూలంగా మలబద్దకాన్ని తొలిగించటమే కాకుండా విరోచనం సాఫీగా అయ్యేలా చూస్తుంది.
వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది.
యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.
పచ్చి బఠాణీల్లో ఉండే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.
పచ్చి బఠాణీలు మగవాళ్ళల్లో శుక్రకణాలు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అదే విధంగా శుక్రకణాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవి సహాయపడుతాయి. అదే సమయంలో శుక్రకణం దృడంగా తయారుఅవ్వటానికి కూడా ఈ పచ్చి బఠాణీలు ఉపయోగపడుతాయి.
శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతాయి. పచ్చి బటాణిలో ఉండే విటమిన్ సి కొల్లా జెన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో చర్మం దృడంగా, కాంతివంతంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!
ఇది కూడా చదవండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.