పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!

0
Advertisement

పచ్చి బఠానీలు ఎక్కువగా వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా లాంటి వాటిలో ఎక్కువగా తీసుకుంటాం. ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. చూడడానికి చిన్నగా వున్నాయి కదా అని వాటిని చిన్న చూపు చూడకండి. ఇలాంటి చిన్న చిన్న బఠానీలతో అనేక లాభాలు ఉన్నాయి.

Green peas are good for you - Chicago Sun-Times

పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే వరకూ అన్ని చర్యలను సహాయపడే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి.

reduces weight - Stress Buster

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు ఇది మంచి ఆహారం అనే చెప్పాలి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.

అజీర్ణం

పచ్చి బఠాణీలు తినటం వలన జీర్ణక్రియ పక్రియ బాగా జరుగుతుంది.
అయితే వీటిని వంటసోడా, మాంసాహారం, మసాలా దినుసులతో కలిపి ఉడికించడకుండా ఎక్కువగా కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ మూలంగా మలబద్దకాన్ని తొలిగించటమే కాకుండా విరోచనం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

Cancer patients show good COVID immune response to vaccine, infection | CIDRAP

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి

వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.

Visual Guide To Heart Attacks

గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

పచ్చి బఠాణీల్లో ఉండే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.

Semen and sperm quality and male fertility

వీర్యాభివృద్దికి మేలు చేస్తాయి..

పచ్చి బఠాణీలు మగవాళ్ళల్లో శుక్రకణాలు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అదే విధంగా శుక్రకణాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవి సహాయపడుతాయి. అదే సమయంలో శుక్రకణం దృడంగా తయారుఅవ్వటానికి కూడా ఈ పచ్చి బఠాణీలు ఉపయోగపడుతాయి.

శరీరానికి మేలు చేస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతాయి. పచ్చి బటాణిలో ఉండే విటమిన్ సి కొల్లా జెన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో చర్మం దృడంగా, కాంతివంతంగా ఉంటుంది.
ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!

Advertisement