అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!

 Authored By praveen | The Telugu News | Updated on :26 June 2021,1:00 pm

మనం సాధారణంగా కొబ్బరి నూనెను జుట్టు కోసం , ఆహారంలో ఉపయోగించడానికి వంట నూనెను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొబ్బరి నూనెను కూడా వంటలోఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు సహజంగా లభించే నూనెల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి కాబట్టి ఈ నూనె చేసే మేలును గురించి తెలుసుకుందాం.

కొబ్బరి నూనె వల్ల లాభాలు:

* మనకున్న ఆహారపు అలవాట్ల వల్ల దంతాల సమస్యలు వాస్తు ఉంటాయి. ఇలా దంతాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ నూనెను తగినంతగా ఉపయోగించడం ద్వారా జలుబు రాకుండా అడ్డుకోవచ్చు.

* కొబ్బరినూనె జుట్టుకు కండిషనింగ్, పోషణను అందిస్తుంది. కొబ్బరి నూనెతో తరచూ జుట్టుకు మర్దనా చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. దీంతో జుట్టు పొడవుగా పెరగడమే కాక మెరుస్తుంది. జుట్టు దృఢంగా మారుతుంది.

* చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా చేసి, చర్మం నునుపుగా, మృదువుగా మారేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో మసాజ్ ఉత్సాహంగా మారుతారు. చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి. చర్మం ప్రకాశిస్తుంది. కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల తామర వంటి చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇది అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కాలుష్యం నుండి కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

* కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణవ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. తగ్గిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది