Mahesh Babu : చనిపోయిన వారం తరవాత మహేశ్ తల్లి ఇందిరా దేవి గురించి వైరల్ అవుతోన్న న్యూస్
Mahesh Babu సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి (indiradevi) చనిపోయి ఇప్పటికే వారం రోజులు అవుతోంది. తను ఆకస్మికంగా చనిపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఒక్కసారిగా మూగబోయింది. సినీ ఇండస్ట్రీ కూడా దిగ్భాంతికి లోనయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే తన తల్లి మరణంపై చాలా డిస్టర్బ్ అయ్యారు. ఆయన బాధపడటం చూసి మహేశ్ అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. మహేశ్ కూతురు సితార కూడా నానమ్మ లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.ఇందిరా దేవి మరణంతో ఆమె సొంత గ్రామం అయిన ముసలిమడుగులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తనది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు అనే గ్రామం. ఆ గ్రామంలో ఇందిరా దేవి చనిపోయారని తెలియగానే గ్రామస్థులు ఒక్కసారిగా దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఇందిరా దేవి ఎప్పుడు ఊరికి వచ్చినా తమను ఆప్యాయంగా పలకరించే వారని గ్రామస్థులు చెబుతున్నారు.ఇందిరా దేవి వీలు చిక్కినప్పుడల్లా తన కొడుకులైన రమేశ్ బాబు, మహేశ్ బాబుతో కలిసి ముసలిమడుగుకు వచ్చేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందిరా దేవికి ముసలిమడుగులో ఓ ఇల్లు కూడా ఉంది. ఇందిరా దేవి కొడుకులు, కూతుళ్లకు అక్కడ పొలాలు, చెలకలు కూడా ఉన్నాయట.
Mahesh Babu : తన ఇద్దరు కొడుకులతో ముసలిమడుగుకు వచ్చేవారు
ఇందిరా దేవీ తనకు ఉన్న ఇంటి స్థలంలో భద్రాచలానికి వచ్చి వెళ్లే భక్తుల కోసం వసతి గృహాన్ని నిర్మించాలని మహేశ్ బాబు కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఇందిరా దేవి మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఎక్కువగా మీడియా ముందుకు వచ్చేవారు కాదు. కేవలం తన కుటుంబ సభ్యుల ఫంక్షన్ ఏదైనా ఉంటేనే హాజరయ్యేవారు. ఇక.. తన ఊళ్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఇందిరా దేవి తన వంతు సాయం చేసేవారు. ఎవరికీ కాదనకుండా ఆర్థిక సాయం చేసేవారు. అందుకే.. ఇందిరా దేవిని అక్కడ అందరూ చాలా గౌరవిస్తారు. ఆమెకు చేతులెత్తి మొక్కుతారు.