
Do you know why they say not to look back after the funeral
సహజంగా మరణం తర్వాత అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అలా అంత్యక్రియలు చేసిన తర్వాత అక్కడికి వెళ్లిన వారిని మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదని చెప్తూ ఉంటారు… అలా ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదో తెలుసా.. మన సాంప్రదాయాలలో ధర్మాలు, ఆచారాలు ఎన్నో ఉంటాయి. అయితే వాటిలో అన్నిటిని పట్టించుకోకపోయినా.. కొన్నిటి మాత్రం అందరూ తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు.
అటువంటి వాటిలో కొన్ని పనులు చేసేటప్పుడు లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వస్తూ ఉంటారు..
ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వారు కానీ తెలిసిన వారు కానీ అందరికీ అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా రావాలని చెప్తూ ఉంటారు.. అయితే అందరూ కూడా అలాగే చేస్తూ ఉంటారు. అయితే అలా ఎందుకు చూడకూడదు.. చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయాలలో మరణానికి సంబంధించి ఎన్నో నియమాలు కొన్ని ఉంటాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్లిన అనంతరం చేయవలసిన అలాగే చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Do you know why they say not to look back after the funeral
ప్రజలు తమ ప్రయోజనం అలాగే క్షేమం కోసం పాటించాల్సిన కొన్ని సంస్కారాలను, సనాతన ధర్మం లో చెప్పారు. వీటిలో ఒకటి మనిషి మరణించిన తర్వాత చేసే అంత్యక్రియలకు సంబంధించినది..
మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఆచారాలు పూర్తయిన తర్వాత ఆత్మ వెళ్లి దైవంలో కలిసిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలన్నీ తొలగిపోతాయి. గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియల అనంతరం మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు..
ఒకవేళ చూస్తే మరణించిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో అనుబంధం మళ్లీ ఏర్పరచుకుంటుందట. తన చావు వలన ఆ వ్యక్తి ఒక్కరే బాధపడుతున్నారని ఆత్మ అనుకుంటుందట. అటువంటి పరిస్థితుల్లో ఆత్మకు శాంతి కలగదు.. ఆత్మ ఆ వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకొని తనతో పాటు ఇంటికి వెళ్లాలని తపన పడుతుందట. ఈ కారణమని అంత్యక్రియల తర్వాత అక్కడున్న వారు వెనక్కి తిరిగి చూడకుండా రావాలని గరుడ పురాణంలో పేర్కొన్నారు.. ఒకవేళ వెనక్కి తిరిగి చూసినట్లయితే ఆ ఆత్మకి శాంతి అనేది కలగదట.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.