Prisoner Parole : రేప్ కేసులో దోషి అతడు.. కానీ భార్యను గర్భవతిని చేసేందుకు 15 రోజుల పేరోల్ ఇచ్చారు.. ఎక్కడో తెలుసా?
Prisoner Parole : రేప్ కేసులో ఓ వ్యక్తికి కోర్టు జైలు శిక్ష వేసింది. దీంతో అతడిని జైలులో వేశారు. కానీ.. ఇటీవల ఆయనకు 15 రోజుల పేరోల్ ఇచ్చారు. ఎందుకు ఆ ఖైదీకి 15 రోజుల పాటు పేరోల్ ఇచ్చారో తెలుసా? ఎందుకో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు. తల్లి కావాలని ఆశ పడుతున్న తన భార్య కోరికను నెరవేర్చేందుకే ఆ ఖైదీకి 15 రోజుల పేరోల్ ను రాజస్థాన్ హైకోర్టును మంజూరు చేసింది. ఖైదీ భార్య రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈ నిర్ణయం తీసుకుంది.
ఒక మైనర్ ను అపహరించిన రాహుల్ అనే 25 ఏళ్ల యువకుడు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. చిన్న వయసులోనే.. పెళ్లయిన కొన్ని రోజులకే దోషి జైలుకు వెళ్లడంతో.. ఆయన భార్య తల్లి కావాలని ఆశపడుతోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా తను ఉండలేదని, తన వంశాన్ని పరిరక్షించాలని పిటిషన్ దాఖలు చేయడంతో ఆమె హక్కులను నిరాకరించకుండా ఉండేందుకు ఆమె భర్తకు 15 రోజుల పాటు పేరోల్ ను కోర్టు మంజూరు చేసింది.
Prisoner Parole : రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పేరోల్ ఇచ్చిన కోర్టు
జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్ తో కూడిన ధర్మాసనం.. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష చొప్పున రెండు ష్యూరిటీ బాండ్లను కోర్టుకు సమర్పించాలని ఖైదీకి కోర్టు స్పష్టం చేసింది. ఇదివరకు కూడా ఒకసారి రాజస్థాన్ హైకోర్టు ఇలాంటి తీర్పే ఒకటి ఇచ్చింది. సేమ్.. ఆ దోషికి కూడా 15 రోజుల పాటు పేరోల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో అలాంటి తీర్పే ఇచ్చింది కోర్టు.