Water Bottles : వాటర్ బాటిల్స్ పై ఉండే లైన్స్ ను ఎప్పుడైనా గమనించారా? అవి ఎందుకు ఉంటాయో తెలిస్తే షాకవ్వాల్సిందే
Water Bottles : వాటర్ బాటిల్స్.. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయాల్లో అవి లేకుంటే కష్టం. మంచి నీళ్లు ఖచ్చితంగా ప్రయాణ సమయంలో ఉండాల్సిన అత్యవసరం. అందుకే.. చాలామంది ఇంట్లో నుంచి వాటర్ బాటిల్స్ ను తీసుకెళ్తుంటారు. ఒకవేళ దూరపు ప్రయాణం అయితే మాత్రం మంచినీళ్ల బాటిల్స్ ను బయట కొనుక్కుంటారు. ఎందుకంటే.. భోజనం చేయకపోయినా.. ఒకటి రెండు రోజులు ఉండొచ్చు కానీ.. వాటర్ లేకుండా బతకలేం కదా. అందుకే.. వాటర్ బాటిల్స్ అనేవి ప్రయాణాల్లో మస్ట్. మీరు ఎప్పుడైనా ప్రయాణాల్లో ఏ రైల్వే స్టేషన్ లోనూ..
బస్ స్టేషన్ లోనో వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగారా? తాగితే.. ఆ బాటిల్స్ ను ఎప్పుడైనా గమనించారా? ఆ బాటిల్స్ మీద ఉండే లైన్స్ ను ఎప్పుడైనా గమనించారా? వాటర్ బాటిల్ డిజైన్ ను ఎప్పుడైనా గమనించారా? అందులోనూ ఒక్కో కంపెనీ బాటిల్ పై ఒక్కో విధంగా లైన్స్ తో డిజైన్ చేస్తారు? ఇదంతా ఎందుకు చేస్తారో తెలుసా? నిజానికి.. ప్రతి కంపెనీ.. ఆయా కంపెనీ వాటర్ బాటిల్స్ ను ఒక ప్రాపర్ డిజైన్ తో తయారు చేస్తారు. అందులో ఈ లైన్ ఒకటి. బాటిల్ చూడటానికి అట్రాక్టివ్ గా ఉండటం కోసం కొన్ని వాటర్ బాటిల్స్ కంపెనీలు ఇలా లైన్స్ తో డిజైన్ చేయిస్తాయి. లైన్స్ తో కంపెనీ బ్రాండ్ ను పెంచుకుంటారన్నమాట. అలాగే..
Water Bottles : బాటిల్ చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం కోసమా?
వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. అందులోనూ అవి పలచని ప్లాస్టిక్ తో తయారు అవుతాయి. అటువంటి బాటిల్స్ పై లైన్స్ గట్రా లేకపోతే.. ఆ బాటిల్స్ ను ఎక్కడైనా వాటర్ లో వేస్తే.. అవి నీటిలో మునిగిపోతాయి. అలా నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు అలా లైన్స్ డిజైన్ చేస్తారు. ఒకవేళ వాటర్ బాటిల్స్ నీటిలో మునిగితే బాటిల్స్ అన్నీ నీటి అడుగున ఉండి పోయి పొల్యూషన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే.. బాటిల్స్ ను చేతితో పట్టుకొని తాగేటప్పుడు గ్రిప్ ఉండాలి. అంటే.. లైన్ ఉండాలి. లైన్ లేకుండా బాటిల్ ఉంటే.. దాన్ని పట్టుకొని తాగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే బాటిల్ కు లైన్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ లైన్స్ పట్టుకొని నీళ్లు తాగేందుకు వీలు ఉండేలా.. బాటిల్ కు కంపెనీలు లైన్ ను డిజైన్ చేస్తాయి.