Package Water Bottle : డేంజర్ బెల్ మ్రోగిస్తున్న ప్యాకేజీ వాటర్ బాటిల్లోని నీళ్లు… పరిశోధనలు ఏం చెబుతున్నాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Package Water Bottle : డేంజర్ బెల్ మ్రోగిస్తున్న ప్యాకేజీ వాటర్ బాటిల్లోని నీళ్లు… పరిశోధనలు ఏం చెబుతున్నాయి…

Package Water Bottle : ప్రస్తుత కాలంలో చాలా మంది ప్యాక్ చేసినటువంటి వాటర్ బాటిల్ లోని నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ ప్యాక్ చేసిన నీళ్లే ప్రస్తుతం మన ప్రాణాలను తీసే ప్రమాదంలో ఉంది అంటున్నారు పరిశోధకులు. ఈ క్షణం వరకు అవే సురక్షితం అనుకొని డబ్బిచ్చి మరి కొనుక్కొని తాగుతున్నాం. హోటల్ కెళ్ళి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్, పెళ్లి కెళ్ళి భోజనం చేసినా కూడా వాటర్ బాటిల్, బస్సులో కావచ్చు, ట్రావెల్ చేసే టైం […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Package Water Bottle : డేంజర్ బెల్ మ్రోగిస్తున్న ప్యాకేజీ వాటర్ బాటిల్లోని నీళ్లు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి...

Package Water Bottle : ప్రస్తుత కాలంలో చాలా మంది ప్యాక్ చేసినటువంటి వాటర్ బాటిల్ లోని నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ ప్యాక్ చేసిన నీళ్లే ప్రస్తుతం మన ప్రాణాలను తీసే ప్రమాదంలో ఉంది అంటున్నారు పరిశోధకులు. ఈ క్షణం వరకు అవే సురక్షితం అనుకొని డబ్బిచ్చి మరి కొనుక్కొని తాగుతున్నాం. హోటల్ కెళ్ళి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్, పెళ్లి కెళ్ళి భోజనం చేసినా కూడా వాటర్ బాటిల్, బస్సులో కావచ్చు, ట్రావెల్ చేసే టైం లో కావచ్చు, ఈ వాటర్ బాటిల్ ను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇలా ఎక్కడ చూసినా నీళ్ళు తాగాలి అంటే బాటిల్స్ ఉండి తీరాల్సిందే. పైగా గ్లాసులలో నీళ్లు తాగితే నమోసి. వాటర్ బాటిల్ ని కొని నీళ్లు తాగితే అది ఒక గొప్ప. ప్రస్తుతం ఇప్పటిలో దాని నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కేవలం ప్యాకేజీ వాటర్ బాటిల్ బిజినెస్ సుమారు 21 లక్షల కోట్ల వరకు చేరింది. అయితే కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలు నివ్వెర పోయే నిజాలు అనేవి బయటపడ్డాయి. ప్రతి లీటర్ నీటిలో సుమారు రెండు లక్షల 40 వేల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి అని తెలిపారు. వాస్తవానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు 10 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉన్నవి అని తెలిపారు. వీరి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ లో ప్రచురితం అయ్యింది..

Package Water Bottle ఏమిటి నానో ప్లాస్టిక్స్

నానో ప్లాస్టిక్స్ అనగా అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. ఇవి కంటికి ఏమాత్రం కూడా కనిపించకుండా నీటిలో కలుస్తాయి. ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇవి రక్తంలో కూడా ఎంతో సులువుగా కలిసిపోతుంది. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎంతో తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉన్నది. కావున గుండెకు కూడా ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వలన ముప్పు ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

Package Water Bottle నానో ప్లాస్టిక్ రేణువులు

వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ప్యాకేజీ వాటర్ బాటిల్ వాడటం ఆ దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమెరికాలోనే మూడు ప్రముఖ కంపెనీల వారు వాటర్ బాటిల్ లోని నీటిని పరిశీలించినప్పుడు ఈ వాస్తవాలు అనేవి బయటపడ్డాయి..

Package Water Bottle అంత ప్రమాదమా

సాధారణంగా ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను తయారు చేసేందుకు ఒకటి 1.5 నుండి 3 లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడాయిల్ ను కూడా ఉపయోగిస్తారు. వీటితో పాటుగా మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతరు. ముఖ్యంగా చెప్పాలంటే. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నచోట ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. కొత్తగా జరిగిన పరిశోధన ప్రకారం చూస్తే, ఓ ప్లాస్టిక్ నీళ్ల సీసాలో పాలి అమైడ్, పాలి ఇథలిన్, పాలి వినైల్ క్లోరైడ్, పాలి మిథైల్ తో పాటుగా చాలా సూక్ష్మతి సూక్ష్మమైన రేణువులను గుర్తించి వాటిపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో ఈ ప్లాస్టిక్ అనేది మనిషి శరీరంపై ఎంతో ప్రభావం చూపిస్తుందని తెలుసుకొని ఎంతో ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి నీళ్లను తాగటం వలన క్యాన్సర్లు,కిడ్నీ,కాలేయ వ్యాధులు, మధుమేహం లాంటి ప్రమాదాలు,బరువు పెరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి అని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు ఈ నీళ్లను అధికంగా తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా ఉంటుంది అని తెలిపారు…

పదేళ్ల వినియోగం ఎలా పెరిగింది : గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగం ఏకంగా 70 % పెరిగింది.దీనికి నిదర్శనం కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కనుక్కొని తాగటం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి వచ్చాయి..

పదేళ్లలో 70 % పెరిగింది : జర్మనీకి చెందినటువంటి ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ అందించిన వివరాల ప్రకారం చూసినట్లయితే, 2023లో అనగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 లక్షల కోట్ల రూపాయల ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్ల వ్యాపారం అనేది బాగా పెరిగింది. వచ్చే ఆరు సంవత్సరాలలో అనగా 2030 నాటికి ఇది ఏకంగా 40 లక్షల కోట్ల నుండి 42 నుండి 43 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే చైనా, మెక్సికో, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలలో కూడా ఈ వినియోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంది..

ఇండియాలో పరిస్థితి ఏంటి

ఇక మన దేశంలోను కొన్నేలుగా వాటర్ బాటిల్ సంస్కృతి అనేది పెరిగిపోవటం వలన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. 2022లో మన దేశంలో ప్యాకేజ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ వ్యాపారం విలువ సుమారు లక్ష 80 వేల కోట్లు. అయితే మరో ఆరు సంవత్సరాలలో ఈ మార్కెట్ విలువ అనేది సుమారుగా మూడు లక్షల కోట్ల వరకు చేరవచ్చు అని అంచనా వేస్తున్నారు..

నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిల్స్ అమ్మకం

ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి నిమిషానికి కూడా సుమారు పది లక్షల వాటర్ బాటిల్ అనేవి అమ్ముడుపోతున్నాయి. ఈ సీసాల తయారులో వినియోగించే ఏ పదార్థం ఈ పర్యావరణానికి మాత్రమే కాక మనుషులకు కూడా మంచిది కాదు. ఈ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ కారణం వలన ప్రతి ఏట నాలుగు నుండి 4.5 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ అనేది వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఇక మన దేశంలో చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ చెప్పిన మాటలలో ఇండియాలో ఏట సుమారుగా 35 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేవి పేరుకి పోతున్నాయి అని తెలిపారు. గడిచిపోయిన 10 సంవత్సరాల కాలంలో ఈ వ్యర్ధాలు అనేవి దాదాపుగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా నదులు, సముద్రాలు, కాలువలు, చివరకు డ్రైనేజీ వ్యవస్థ కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలతో ప్లాస్టిక్ బాటిల్స్ తో నిండిపోతుంది అని అన్నారు. నిజం చెప్పాలంటే ఈ నీళ్ల తో పోల్చినట్లయితే శుభ్రపరచిన కొళాయి నీళ్లు చాలా మంచిది అని ఎన్నో పరిశోధనలు తెలిపాయి.

Package Water Bottle డేంజర్ బెల్ మ్రోగిస్తున్న ప్యాకేజీ వాటర్ బాటిల్లోని నీళ్లు పరిశోధనలు ఏం చెబుతున్నాయి

Package Water Bottle : డేంజర్ బెల్ మ్రోగిస్తున్న ప్యాకేజీ వాటర్ బాటిల్లోని నీళ్లు… పరిశోధనలు ఏం చెబుతున్నాయి…

గతంలో మన అలవాట్లు ఎలా ఉండేవి : వాస్తవానికి ప్రస్తుత కాలంలో అనగా 19వ శతాబ్దపు అర్ధ భాగంలో ఇతర ప్రాంతాల గురించి ఆయా ప్రాంతాల్లో సౌకర్యాల గురించి అలాగే అక్కడి ఆచారాలు మరియు సాంప్రదాయాల అన్యపదేశంగా చర్చించిన పుస్తకం ఏనుగుల వీర స్వామయ్య రాసిన కాశీయాత్ర చరిత్ర. 1830- 31 మధ్య కాలంలో సుమారుగా 15 నెలల పాటు నాటి చిన్న పట్టణం నేటి చెన్నై నుండి కాశీ వరకు చేసిన ప్రయాణ విశేషాలు దీనిలో ఆయన నాటి ప్రయాణాల అనుభవాల గురించి చెబుతూనే,మార్గం మద్యంలో ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయో కూడా తెలిపారు. ముఖ్యంగా చెప్పాలంటే. దాదాపు 194 సంవత్సరాల క్రితం మాట. దారిలో సత్రాల గురించి మరియు నీటి సౌకర్యాల గురించి మరీ ముఖ్యంగా చెప్పాలంటే తాగునీటి విషయం వచ్చేసరికి కచ్చితంగా మంచి నీటిగుంట ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తెలిపారు. ప్రస్తుత కాలంలో జమీందారులు, భూస్వాములు తమ కుటుంబీకుల పేరిట మార్గం మధ్యలో సత్రాలు మరియు తాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించేవారు…

తోలు సంచులు,వెదురు సీసాలు : కాలుష్యానికి ఎంతో దూరంగా ఉండటం వలన వాటిని చాలా వరకు తాగే వారు. మరి నీటి ఎద్దటి టైమ్ లో ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా తోలు సంచులలో నీటిని పట్టుకొని తీసుకొని వెళ్లేవారు. దీని తర్వాత కాలంలో రబ్బర్ సంచులు వాడకం అనేది కూడా ఉండేది. అంతేకాక వెదురు బొంగుల్ని కూడా నీటి డబ్బాలుగా మార్చుకొని వాటిలో ప్రాంతాలకు నీటిని తీసుకొని వెళ్లేవారు. దీని తర్వాత లోహపు వస్తువుల వాడకం మొదలైన తరువాత ప్రయాణాల్లో తాగునీటిని తీసుకెళ్లటం మరింత సులభం అయింది. మరచంబుల వాడకం అనేది కూడా అప్పటిలోనే ప్రారంభం అయ్యింది.తర్వాత కాలంలో గాజు సీసాల వాడకం అనేది పెరిగింది. దీని తర్వాత ప్లాస్టిక్ యుగం అనేది పూర్తిస్థాయిలో మొదలయ్యింది. నీటిని కొనుక్కోవడం అంటే 20 ఏళ్ల క్రితం వరకు దేశంలో చాలా విచిత్రంగా చూస్తూ ఉండేవారు. ఏ రకంగా చెప్పాలి అంటే. రాను రాను మంచి నీళ్ల పర్యాయపదం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ గా మారింది. కానీ తాజా పరిశోధనలో మాత్రం మళ్లీ బ్యాక్ టు బేసిక్స్ అని తెలిపారు. మరి అందుకు మనం సిద్ధంగానే ఉన్నాం..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది