Doctor Harshavardhan : చావు ముందే తెలుసుకొని పెళ్ళాం, పేరెంట్స్ కి న్యాయం చేసి అంతిక్రియలకు తానే ప్లాన్ సంచలన వీడియో..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Doctor Harshavardhan : చావు ముందే తెలుసుకొని పెళ్ళాం, పేరెంట్స్ కి న్యాయం చేసి అంతిక్రియలకు తానే ప్లాన్ సంచలన వీడియో..!!

Doctor Harshavardhan ; ప్రస్తుత రోజుల్లో బతికుండగానే కట్టుకున్న భార్యను కన్న తల్లిదండ్రులను వేధించే కొడుకులు చాలామంది ఉన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చనిపోతానని ముందే తెలుసుకొని కట్టుకున్న భార్యకు కన్న తల్లిదండ్రులకు ఊహించని విధంగా ముందే మేలు చేశాడు. అదే సమయంలో తన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని ఎక్కడ కూడా బాధ పెట్టకుండా.. సరైన ముగింపుతో తుది శ్వాస విడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 April 2023,2:00 pm

Doctor Harshavardhan ; ప్రస్తుత రోజుల్లో బతికుండగానే కట్టుకున్న భార్యను కన్న తల్లిదండ్రులను వేధించే కొడుకులు చాలామంది ఉన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చనిపోతానని ముందే తెలుసుకొని కట్టుకున్న భార్యకు కన్న తల్లిదండ్రులకు ఊహించని విధంగా ముందే మేలు చేశాడు. అదే సమయంలో తన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని ఎక్కడ కూడా బాధ పెట్టకుండా.. సరైన ముగింపుతో తుది శ్వాస విడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఏవూరి హర్షవర్ధన్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. 2020 ఫిబ్రవరి నెలలో సింధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. కొడుకు పెళ్లిని తల్లిదండ్రులు చాలా ఘనంగా నిర్వహించారు. పెళ్లయిన రెండు వారాలకే భార్యను విడిచి హర్షవర్ధన్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు.

Doctor Harshavardhan | చావును ముందే గ్ర‌హించిన ఖ‌మ్మం డాక్ట‌ర్.. భార్య‌కు  విడాకులిచ్చి.. క‌న్నీరు పెట్టిస్తున్న విషాద‌గాథ‌ ఇది.. | Vidhaatha | Latest  Telugu News

అయితే సింధు 2020 ఏప్రిల్ నెలలో ఆస్ట్రేలియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఆ టైంకి భార్య సింధుకి హర్ష విసా ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఈ లోపే మహమ్మారి కరోనా రావటంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ పరిణామంతో సింధు ఆస్ట్రేలియా వెళ్ళలేక పోయింది. ఆస్ట్రేలియాలో హర్ష ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా రాణిస్తున్నాడు. అయితే 2020 అక్టోబర్ నెలలో జిమ్ లో వ్యాయామం చేస్తుండగా దగ్గు ఆయాసం బాగా రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అయితే ఆ వైద్య పరీక్షలో లాంగ్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వాళ్లు వెంటనే ఇండియా వచ్చేయమని పేర్కొన్నారు. అయితే ఆస్ట్రేలియాలో మంచి మెడిసిన్ ఉందని.. వాడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.

ఇంతలో పరిస్థితి అంతా సద్దుమణిగిందని మెడిసిన్ బాగా పని చేసిందని తల్లిదండ్రులను ధైర్యపరిచాడు. మళ్లీ కొద్ది రోజులకే వ్యాధి ముదరటంతో ఈసారి ప్రాణాంతకం తప్పదని తెలియజేయడంతో… హర్ష కూడా ఇంక మరణం తప్పదని తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా భార్య సింధు భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచించి… ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి.. సింధూకి అదనంగా ఇవ్వాల్సింది ఇచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది. తర్వాత సింధు భవిష్యత్తుకు కావలసిన ఏర్పాట్లు చేసి అమెరికాలో ఆమె స్థిరపడేలా.. మిగతా పెళ్లి సంబంధాలు వచ్చేలా ఏ అడ్డు లేకుండా హర్షవర్ధన్ అక్కడితో ఆమెకు ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 2022 అక్టోబర్ నెలలో చివరిసారిగా తన తల్లిదండ్రులను ఖమ్మం వచ్చి చూశాడు. ఆ తర్వాత తన తమ్ముడు అమెరికాలో ఉండటంతో తల్లిదండ్రులను అక్కడికి పంపించేశాడు. వైద్యులు ముందుగానే హర్ష చనిపోయే తేదీలు సమయం తెలియజేయడం జరిగింది.

Doctor Harshavardhan khammam Latest news Australia Harshavardhan

Doctor Harshavardhan  khammam Latest news Australia Harshavardhan

దీంతో హర్ష తన శవం ఎవరికీ బరువు కాకుండా ఆస్ట్రేలియాలో ఓ లాయర్ తో మాట్లాడి ఆర్థరైజేషన్ అక్కడి తన స్నేహితులకు ఇచ్చాడు. అదేవిధంగా శవపేటికను స్వయంగా ఆర్డర్ చేసుకున్నాడు. తన దగ్గర కార్ అమ్మేసి తన తల్లిదండ్రుల వద్దకు తన శవం చేరేలా… స్నేహితులకు భారం కాకుండా అన్ని ఖర్చులు ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు రోజు స్నేహితులతో బంధువులతో వీడియో కాల్ లో హర్ష మాట్లాడటం జరిగింది. అనంతరం తన రూమ్ లో 32 సంవత్సరాల హర్షవర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో హర్షవర్ధన్ తన డెడ్ బాడీ అన్నీ కూడా ఇంటికి సాగనంపేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా కూడా ఎవరికీ భారం కాకుండా ఖమ్మంకి హర్షవర్ధన్ బాడీ రావడంతో తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమ దశలో ఎవరికి భారం కాకుండా హర్షవర్ధన్ తన చావు తెలుసుకుని వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది