Doctor : ఫోన్‌లో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సు.. చివరి ఏం జరిగిందంటే..?
Doctor : ఈ రోజుల్లో కొందరు వైద్యులకి మనుషుల ప్రాణాలంటే లెక్కేలేదు. చాలా అశ్రద్ధతో ఆపరేషన్స్ చేస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరి చేయడంతో పుట్టిన మగశిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. డాక్టర్ నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయిందంటూ పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన పిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Doctor ప్రాణాలతో చెలగాటం..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలీవరీ చేయాలని నరేశ్ కుటుంబసభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు. అయితే డాక్టర్ శ్రీజను చూడకుండానే, గర్భిని అని కనికరం లేకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు బాగా రావడంతో అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎమ్‌లు శ్రీజ పరిస్థితిని డాక్టర్ కు ఫోన్ లో వివరించారు. దీంతో వైద్యురాలు. స్టాఫ్ నర్స్ కి ఏఎన్‌ఎంకి తాను ఫోన్ లో చెబుతున్న తీరు చేయండి అని వారికి సూచన చేయడంతో ఇద్దరు నర్సులు శ్రీజను లేబర్ రూమ్ కి తీసుకెళ్లారు.
అయితే డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఆమె ఇచ్చిన సూచనల ప్రకారం నర్సులు డెలివరీ చేశారు. వారికి మగబిడ్డ జన్మించారు. అయితే తల్లికి బిడ్డను చూపించకుండా వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్‌ఎమ్‌ల నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ భర్త నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా డాక్టర్ ఫోన్ లో చేస్తున్న సూచనలతో డెలివరి చేసినట్లు స్టాఫ్ నర్స్ ఏఎన్‌ఎమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.