Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్… శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్..!
ప్రధానాంశాలు:
మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి చిన్నారి మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్
నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్... శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్..!
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar మల్లాపూర్ బాబానగర్ కు చెందిన గుడిసె కవిత గురువారం మల్లాపూర్ సూర్య నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కొరకు సాయంత్రం ఐదున్నర గంటలకు వెళ్ళింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లు నిర్లక్ష్యంగా స్టాఫ్ నర్స్ తో డెలివరీ చేయించడంతో పాప మృతి చెందింది, సదరు డాక్టర్, స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ,సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట సీపీఐ, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్,ఎన్ఎఫ్ఐడబ్య్లు ఉప్పల్ మండల సమితి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్… శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్..!
Mallapur ఆసుపత్రి ఎదుట సీపీఐ, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్,ఎన్ఎఫ్ఐడల్యూ ఆధ్వర్యంలో ధర్నా
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్ లు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు యమపాశాలుగా మారాయనడానికి ఈ ఘటన తార్కాణంగా మారిందని ధ్వజమెత్తారు. మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఇప్పటివరకు 75కు పైగా డెలివరీలు చేశానని బాహాటంగా చెబుతుందంటే, ఈ ఆసుపత్రిలో డాక్టర్ సేవలు నిరుపయోగమనే భావన వ్యక్తం అవుతుందన్నారు. చిన్నారి ఘటన విషయంలో స్టాఫ్ నర్సు అన్నీ తానై, డాక్టర్ కు సమాచారం ఇచ్చినా సమయానికి రాకపోవడంతో వల్లనే చిన్నారి మరణించిందని వారు ఆరోపించారు. ఈ ఆసుపత్రిలో గతంలొనే అనేక ఘటనలు జరిగాయని,
కుక్క కాటుకు రాబీస్ టీకా లేకపోవడం,సిబ్బంది, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి ఘటనలు జరిగాయన్నారు. ప్రజల పట్ల, పేషెంట్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ ఆసుపత్రికి సాధారణంగా మారిందని విమర్శించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి డాక్టర్ ….మల్లాపూర్ ఆసుపత్రిలోనే మరణించిన చిన్నారిని, గాంధీ ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. చిన్నారి మృతి ఘటనపై జిల్లా వైద్యశాఖ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ జరిపి, ఘటనకు కారకులైన డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం, ఈ ఘటనపై విచారణ జరపడానికి ఆసుపత్రికి వచ్చిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ వైద్యశాకాదికారి సత్యవతికి సంఘాల పక్షాన ఫిర్యాదు చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్,ఏఐఎస్ఎఫ్ నాయకులు అజీమ్ పాషా, మహిళా సమాఖ్య నాయకురాలు మేరీ, స్వర్ణ ,కావ్య,రాజు పాల్గొన్నారు.