Beer | కిడ్నీ రాళ్లు తొలగించడానికి బీరు తాగాలా.. నిజమెంటీ? అవన్నీ అపోహలేనా?
Beer | కిడ్నీలో రాళ్ల సమస్య చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనికి సంబంధించి ప్రజలలో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా “బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి అనేది చాలా మందిలో ఉన్న ప్రబలమైన నమ్మకం. కానీ ఇది నిజమేనా? వైద్యపరంగా ఇది ఎంతవరకు సత్యం? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

#image_title
బీరు తాగడం వల్ల రాళ్లు పోతాయా?
ఇది పూర్తిగా అపోహ మాత్రమే . సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అధిపతి డా. హిమాన్షు వర్మ గారి ప్రకారం బీరు తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది, ఇది నిజం. దీనివల్ల కొన్ని చిన్న రాళ్లు (5mm లోపు) మూత్రంతో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ… బీరు లో రాళ్లను కరిగించే లేదా తొలగించే ఎలాంటి రసాయనాలు ఉండవు.అంతేకాదు, బీరు లేదా మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నీటి కొరత) కలుగుతుంది.
ఇది కొత్త రాళ్ల ఏర్పాటుకు దారితీసే ప్రమాదం ఉంది. మరి కిడ్నీ రాళ్లకు సరైన పరిష్కారం ఏమిటి అంటే..
వైద్యుల సలహా తీసుకోవాలి.
రోజూ తగినంత నీరు (8–10 గ్లాసులు) తాగాలి.
ఆక్సలేట్, సోడియం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి.
శరీరాన్ని డీహైడ్రేట్ చేయగల పానీయాలు (బీరు, మద్యం, కూల్ డ్రింక్స్) నుంచి దూరంగా ఉండాలి.
మితమైన వ్యాయామం, హైడ్రేషన్ మెయింటెయిన్ చేయాలి.