Onions | నల్ల మచ్చలు, బూజు పట్టిన ఉల్లిపాయలు తినడం ప్రాణాంతకమే .. నిపుణుల హెచ్చరిక
Onions | మన వంటింట్లో ఉల్లిపాయలు తప్పనిసరి పదార్థం. కూరలో ఉల్లిపాయలు లేకపోతే రుచి ఉండదనేంతగా ఇవి ప్రతి ఇంటి వంటలో భాగమైపోయాయి. కానీ, కొన్ని సార్లు ఉల్లిపాయలపై నల్ల మచ్చలు రావడం, బూజు పట్టడం జరుగుతుంది. అలాంటి ఉల్లిపాయలను వాడకూడదని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

#image_title
బూజు పట్టిన ఉల్లిపాయలలో ప్రమాదకరమైన టాక్సిన్లు
నిపుణుల ప్రకారం, నల్ల మచ్చలు లేదా బూజు ఉన్న ఉల్లిపాయలు *మైకోటాక్సిన్* అనే విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మానవ శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. అలాంటి ఉల్లిపాయలను తినడం వల్ల ఆహార అలెర్జీలు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వెంటనే తలెత్తవచ్చు. అంతేకాకుండా, దీర్ఘకాలంలో కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంది.
సరైన విధంగా నిల్వ చేసిన తాజా ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
* రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
* టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.
* వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
* హీట్‌స్ట్రోక్ నివారణలో ఉపశమనం కలుగుతుంది.
నిల్వ చేసే సమయంలో జాగ్రత్తలు
* ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కొనొద్దు. అవసరమైనంత మాత్రమే తెచ్చుకోవాలి.
* ఉల్లిపాయలను చల్లటి, తేమగా ఉండే ప్రదేశాల్లో ఉంచరాదు.
* గాలి తగులుతున్న పొడి ప్రదేశంలో ఉంచితే ఎక్కువకాలం తాజాగా నిల్వ అవుతాయి.
నిపుణులు చెబుతున్నట్లుగా, నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలను కట్ చేసి మిగిలిన భాగాన్ని వాడటం చాలా ప్రమాదకరం . కాబట్టి, అలాంటి ఉల్లిపాయలను వెంటనే పడేయడం మేలు.