Dragon Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ లో డ్రాగన్ చికెన్.. ఒక్కసారి తిన్నారంటే అస్సలే వదిలి పెట్టరు!
Dragon Chicken Recipe : మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఇంట్లో వండని ఆహార పదార్థాలను మాత్రమే కొని తింటుంటాం. అలాంటి రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు చాలా మంది కొని తినే చికెన్ రెసిపీల్లో ముఖ్యమైనది డ్రాగన్ చికెన్. ఎందుకంటే మనం ఆ వంటకాన్ని ఇంట్లో చేయం కాబట్టి. కానీ దీన్ని కూడా ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ లో తయారు చేసుకోవచ్చు. అయితే అదెలాగో మీరు ఇప్పుడు చూడండి.కావాల్సిన పదార్థాలు.. అఱ కిలో చికెన్, కొత్తిమీర కొదద్ిగా, నూనె, రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్, కారం వెల్లుల్లి పేస్టు, ఒక గుడ్డు, అర కప్పు మైదా, పావు కప్పు మొక్క జొన్న పిండి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాలు, పావు టేబుల్ స్పూన్ అజినమోటో, అలాగే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర.
తయారీ విధానం… ముందుగా చికెన్ ను బాగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టాడానికి ఇచ్చిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత ఓవెన్ లో ప్రైయింగ్ పాన్ పెట్టి వేయించడానికి కావాల్సినంత నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓవెన్ లో మరో ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక అందులో పచ్చి మిర్చి, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
తర్వాత ఉల్లిపాయలు, వెజ్ లు వేసి బాగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం పాటు అటూ ఇటూ తిప్పాలి. తర్వాత చిల్లీ గార్లిక్ పేస్టు, సోయాసాస్, టొమాటో కెచప్, ఉప్పు, అజినమోటో, పంచదార వేసి బాగా గిలకట్టాలి. 2 నిమిషాల పాటు ఆరబెట్టి కాస్త చిక్కబడే వరకు తిప్పాలి. తర్వాత ముందుగా వేయించన చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి కదిలించి పైన కొత్తిమీర చల్లితే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ రెడీ. మీరూ ఓ సారి ట్రై చేయండి.