Drumstick Leaves : లేత మునగాకుతో ఇలా చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drumstick Leaves : లేత మునగాకుతో ఇలా చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.. వీడియో

Drumstick Leaves : మునగాకు గురించి ఎంత మందికి తెలుసు. మునగ చెట్టు తెలుసు కదా. ఆ చెట్టు మొత్తం ఔషధాల గని. చెట్టు కాండం, ఆకు, కాయలు అన్నీ ఔషధ గుణాలు ఉన్నవే. దేంట్లో లేని ఆయుర్వేద గుణాలు మునగాకులో ఉంటాయి. అందుకే మునగాకుకు అంత డిమాండ్. పల్లెటూర్లలో అంటే మునగ చెట్లు ఉంటాయి కానీ.. మునగ చెట్లు పట్నాల్లో ఎక్కడ కనిపిస్తాయి. అందుకే మునగాకు దొరక్కపోయినా మునగకాయలను కొనుక్కొని కూరలో వేసుకుంటున్నాం. కానీ.. మునగకాయ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 April 2023,8:00 pm

Drumstick Leaves : మునగాకు గురించి ఎంత మందికి తెలుసు. మునగ చెట్టు తెలుసు కదా. ఆ చెట్టు మొత్తం ఔషధాల గని. చెట్టు కాండం, ఆకు, కాయలు అన్నీ ఔషధ గుణాలు ఉన్నవే. దేంట్లో లేని ఆయుర్వేద గుణాలు మునగాకులో ఉంటాయి. అందుకే మునగాకుకు అంత డిమాండ్. పల్లెటూర్లలో అంటే మునగ చెట్లు ఉంటాయి కానీ.. మునగ చెట్లు పట్నాల్లో ఎక్కడ కనిపిస్తాయి. అందుకే మునగాకు దొరక్కపోయినా మునగకాయలను కొనుక్కొని కూరలో వేసుకుంటున్నాం. కానీ.. మునగకాయ కంటే కూడా మునగ ఆకు చాలా మంచిది.

Drumstick Leaves Benefits & Side Effects - NourishDoc

మునగ ఆకులో ఉండని విటమిన్ ఉండదు. సాధారణంగా ఒక్కో కూరగాయ, పండులో ఒక్కో విటమిన్ ఉంటుంది. అన్ని విటమిన్స్ కావాలంటే ఖచ్చితంగా అన్ని పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కానీ.. అవేవీ తీసుకోకుండా.. ఒక్క మునగాకును తీసుకుంటే చాలు అన్ని రకాల విటమిన్స్ మనకు అందుతాయి. మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. మునగాకును ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు.

Drumstick Leaves Health Benefits Munagaku

Drumstick Leaves Health Benefits Munagaku

Drumstick Leaves : మునగాకు వల్ల కలిగే లాభాలు ఏంటి?

అంటే.. ఆకుల రూపంలో, పేస్ట్ రూపంలో, రసం రూపంలో, ఇంకా చెప్పాలంటే ఆకుని ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పౌడర్ ను కూడా మనం వినియోగించుకోవచ్చు. మునగాకుతో టీ తయారు చేసుకొని తాగుతూ ఉంటే చాలా రోగాలు నయమైపోతాయి. మందులు కూడా అవసరం లేకుండా అంత చక్కగా మన ఆరోగ్యం మెరుగు అవుతుంది. పేగుల్లో నిలువ ఉండే కొవ్వులను కూడా తొలగించేస్తుంది మునగాకు. అలాగే.. స్థూలకాయంతో బాధపడేవాళ్లు కూడా మునగాకు టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు టీ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్టరాల్ తగ్గి మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది