Moringa Leaves : మునగాకు తింటున్నారా..?? వాటి ప్రయోజనాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Moringa Leaves : మునగాకు తింటున్నారా..?? వాటి ప్రయోజనాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!!

 Authored By aruna | The Telugu News | Updated on :6 January 2024,8:30 am

Moringa Leaves : మన శరీరానికి మంచి పోషకాలను అందించే ఆహార పదార్థాలలో ఒకటి మునగాకు. మునగాకు లేదా మునక్కాయలలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. పలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా అదుపు చేసే గుణం మునగాకుల్లో ఉంటుంది. ముఖ్యంగా గర్భవతి మహిళలకు మునగాకు ఇవ్వడం వలన ఎంతో మంచి జరుగుతుంది. మునగాకు తీసుకోవడం వలన డయాబెటిస్, రక్తపోటు, కీళ్ల నొప్పులు, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా మునగాకు లేదా మునగకాయలను తీసుకుంటే పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. మునగాకులో విటమిన్ ఏ , సి, ఈ లతోపాటు పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు మునగాకు తో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మునగాకు లేదా మునక్కాయలను తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఆకలి సమస్యలు కూడా తీరుతాయని వెల్లడించారు. అధిక బరువు ఉన్నవారు మునగాకు తీసుకుంటే సన్నగా అవ్వచ్చు అని చెబుతున్నారు. మునగాకు తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తొలగించడంలో మునగాకు సహాయపడుతుంది. మునగాకు నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవడం వలన జుట్టు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

మునగాకులో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమినో యాసిడ్లను కూడా కలిగి ఉంటుంది. ఇవి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కణాలను దెబ్బ తినకుండా రక్షించగల రోగ నిరోధక వ్యవస్థ పెంచే పదార్థాలు మునగాకులో ఉంటాయి. మునగాకు రసం వాపు, ఎరుపు, నొప్పిని తగ్గిస్తుంది. మునగాకు క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కీమోథెరపీ మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్ ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రసాయనాలు ఉంటాయని, మెదడులో ఒత్తిడిని, మంటను నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది