TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా బస్సుల్లో ప్రయాణించే వారికోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ డ్రాలో గెలిచిన విజేతలకు మొత్తం ₹5.50 లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నారు.

#image_title
లక్కీ డ్రా నిర్వహణ తేదీలు
లక్కీ డ్రా కాలం: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు
డ్రా తేదీ: అక్టోబర్ 8
విజేతల ఎంపిక: ప్రతి రీజియన్‌లో ముగ్గురు చొప్పున మొత్తం 33 మంది విజేతలు
బహుమతుల వివరాలు (ప్రతి రీజియన్‌కు)
1. ప్రథమ బహుమతి: ₹25,000
2. ద్వితీయ బహుమతి: ₹15,000
3. తృతీయ బహుమతి: ₹10,000
మొత్తం బహుమతుల విలువ: ₹5,50,000
టీఎస్‌ఆర్టీసీకి చెందిన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించాలి.ప్రయాణం పూర్తయ్యాక, టికెట్‌పై మీ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ రాసి, బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేసాలి.రిజర్వేషన్‌తో ప్రయాణించిన వారు కూడా లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.సెప్టెంబర్ 27 – అక్టోబర్ 6 మధ్య చేసిన ప్రయాణాలే లెక్కలోకి తీసుకుంటారు. ప్రయాణికులు పెద్దఎత్తున ఈ లక్కీ డ్రాలో పాల్గొని, తమ పండుగకు మరింత ఆనందాన్ని చేకూర్చుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే మా లక్ష్యం,” అని ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.