AP Early Elections : BREAKING.. ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు..!
AP Early Elections : ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల గురించి ఎందుకు చర్చ నడుస్తోంది. ఏపీలో ఎందుకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. అసలు దాని గురించి ఎందుకు చర్చ నడుస్తోంది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ముందే ఎన్నికల హడావుడి ఎందుకు మొదలవుతోంది. అసలు ముందస్తు ఎన్నికల గురించి ఎంత చర్చ నడుస్తోంది. దానికి కారణం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో కాకుండా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి వైఎస్సార్సీపీ పార్టీ సమాయత్తం అవుతోందట.
ఎందుకంటే ప్రస్తుతం అధికారం వైసీపీ చేతుల్లో ఉంది. దీంతో వైసీపీ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. అసెంబ్లీని డిస్సాల్వ్ చేస్తుంది. దీంతో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సిందే. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికల అంశాన్ని అంత ఈజీగా మనం కొట్టిపారేయలేం.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రోజులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కేవలం ప్రజా సంక్షేమం మీద, పథకాల మీద, ఏపీ రాజధానులు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు. కానీ.. ఇప్పుడు వైఎస్ జగన్ పూర్తిగా వచ్చే ఎన్నికల మీద ఫోకస్ పెట్టారట.
AP Early Elections : ఫుల్ టు ఫుల్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేసిన జగన్ మోహన్ రెడ్డి
ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తేనే కదా.. అధికార పీఠం ఎక్కేది. అందుకే.. ఎక్కడికెళ్లినా.. ఏం మాట్లాడినా తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెబుతున్నారు. ఇంకా గెలిపిస్తే ఏం చేస్తామో కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. నిజంగానే ఎన్నికలు వస్తే ఇతర పార్టీలు కూడా సమాయత్తం అవ్వాలి కదా. అందుకే.. ఇతర పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే అన్నట్టుగా సిద్ధం అవుతున్నాయి. అందుకే టీడీపీ పార్టీ అధినేత కూడా జిల్లాలను పర్యటిస్తున్నారు. కార్యకర్తలను యాక్టివేట్ చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. చూద్దాం మరి.. నిజంగానే వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక 2024 వరకు ఆగుతారా? అనేది.