Railway Jobs : రైల్వేలో 756 జాబులు.. టెన్త్ పాస్ అయితే చాలు.. ఇలా అప్లై చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway Jobs : రైల్వేలో 756 జాబులు.. టెన్త్ పాస్ అయితే చాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 February 2022,8:30 pm

Railway Jobs: సెంట్ర‌ల్ రైల్వేలో జాబ్ కొట్ట‌డం మీ క‌ల‌నా.. అయితే మీకో గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. రైల్వే డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు వ‌చ్చి ప‌డ్డాయి. ఇందుకోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింది. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఈ ఖాళీలు ఉన్న‌ట్టు నోటిఫికేష‌న్ లో పేర్కొంది. మొత్తం 756 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఇందులో 263 ఖాళీలు విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాగా వీటికి మార్చి 7 ఆఖ‌రు తేదీగా ఉంది. ఆలోపే అప్లికేష‌న్ చేసుకోవాలి. కాగా ఒకరు ఒక్క యూనిట్‌కు మాత్ర‌మే అప్లికేష‌న్ చేసుకోవాలి.

అలా కాకుండా ఒక‌టి కంటే ఎక్కువ యూనిట్ల‌కు అప్లికేష‌న్ చేసుకుంటే అది చెల్ల‌దు. అంతే కాకుండా విద్యార్హ‌త‌ల‌ను కూడా ఒక‌టికి రెండుసార్లు బేరీజు వేసుకునేఇ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న 756 జాబుల్లో క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ తో పాటు మంచేశ్వర్, భువనేశ్వర్ డివిజ‌న్ల‌లో 190 పోస్టులు ఉన్నాయి. ఖుర్దా రోడ్ డివిజన్ లో 237, వాల్తేర్ డివిజన్ లో 263 పోస్టులు ఉన్నాయి. ఇక సంబాల్‌పూర్ డివిజన్ లో కూడా 66 జాబులు ఉన్నాయి. వాల్తేర్ డివిజన్‌లో 263 జాబులు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్ సెక్ష‌న్ లో 102, వెల్డర్ లో 54, టర్నర్ లో 11, ఎలక్ట్రీషియన్ లో 50, మెషినిస్ట్ లో 4, డ్రాఫ్ట్స్‌మ్యాన్ లో 4 జాబులు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

east coast railway recruitment 2022 756 jobs in railways tent pass is enough apply like

east coast railway recruitment 2022 756 jobs in railways tent pass is enough apply like

Railway Jobs :  50శాతం పాస్ పర్సెంటీ కావాలి..

వీటితో పాటు వైర్‌మ్యాన్ పోస్టులు 10, కార్పెంటర్ పోస్టులు 9, మేసన్ 6 జాబులు ఉన్నాయి. వీట‌న్నింటికీ ఈ నెల 8న‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభం అయింది. 10వ తరగతి 50 శాతం పాస్ ప‌ర్సెంటీజీ ఉన్న వారంతా అర్హులు. దాంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లో చ‌దువ‌కుని పాసై ఉండాలి. 24 ఏళ్లులోపు వ‌య‌సు ఉండాలి. రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాగా ఈ జాబుల కోసం https://etrpindia.com/rrc_bbn_act/index.php వెబ్‌సైట్ లో అప్లై చేసుకోవాలి. కాగా అప్లై చేసుకున్న ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క‌చ్చితంగా జ‌త చేయాల్సి ఉంటుంది. మ‌రి లేటెందుకు మీరు కూడా అప్లై చేసుకోండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది