EGG | గుడ్లను స్టోర్ చేయడంలో మీరు చేస్తున్న తప్పులు.. పాడైపోయిన గుడ్లను ఇలా గుర్తించండి
EGG | మార్కెట్లలో గుడ్లు చౌకగా లభించడంతో, చాలా మంది ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే తరచూ మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు కూడా గుడ్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే గుడ్లను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం వల్ల అవి చెడిపోతే, ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#image_title
పాడైపోయిన గుడ్లను ఇలా గుర్తించండి
ఇందుకే గుడ్లను ఎంతసేపు నిల్వ ఉంచాలో, అవి పాడైపోయాయో లేదో ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అవసరం. గుడ్లను నిల్వ ఉంచితే 30 రోజులు (ఒక నెల) వరకు నిల్వ చేయవచ్చు. బయట (గదిలో) ఉంచితే మాత్రం గరిష్టంగా ఒక వారం మాత్రమే నిలుస్తాయి. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ చేస్తే, గుడ్లు పాడయ్యే అవకాశం ఉంది.
గుడ్డును ఒక పాత్రలో పగులగొట్టి వాసన చూడండి.సాధారణ గుడ్డుకు వచ్చే వాసన కాకుండా అసహ్యకరమైన వాసన వస్తే, అది పాడైపోయిందనే అర్థం.. నీటిలో ముంచడం టెస్ట్ కూడా ఒకటి. ఒక గిన్నెలో నీటిని పోసి అందులో గుడ్డు వేశాక గుడ్డు మునిగిపోతే అది బాగుంది, గుడ్డు తేలిపోతే అది పాడైపోయింది. గుడ్డు నిటారుగా నిలబడితే అది కూడా పాడవుతుండే లక్షణం. గుడ్డును షేక్ చేసి చూస్తే శబ్ధం వస్తే పాడైనట్టు. చెడిపోయిన గుడ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పొయిజనింగ్,వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపించవచ్చు. శరీరంలో విషతుల్యత పెరిగే అవకాశం ఉంటుంది.