Rotten Eggs : కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. ఈ ట్రిక్‌తో ఇట్టే క‌నిపెట్టొచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rotten Eggs : కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. ఈ ట్రిక్‌తో ఇట్టే క‌నిపెట్టొచ్చు..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2025,7:00 am

Rotten Eggs : గుడ్డు శరీరానికి అద్భుతమైన పోషకాహారాన్ని అందించే ఆహార పదార్థం. ఇందులో ఎన్నో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, బీ-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండడం వల్ల ఇది శరీరానికి మల్టీ విటమిన్‌లా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలకంగా సహాయపడుతుంది. అయితే గుడ్డును ఎంతకాలం నిల్వ ఉంచాలి? ఇది చెడిపోయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే విషయాల్లో చాలామందిలో అనుమానాలు ఉంటాయి. దీనిపై నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

Rotten Eggs : ఈ టిప్స్ పాటించండి..

గుడ్లను ఫ్రిజ్‌లో సుమారు నెల రోజులపాటు భద్రంగా ఉంచవచ్చు. అయితే బయట ఉంచితే ఒక వారం మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత వాటి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. పాడైపోయిన గుడ్డును గుర్తించాలంటే… గుడ్డును ఓ పాత్రలో పగులగొట్టి వాసన చూడండి. సాధారణ గుడ్డు వాసన కాకుండా చెడు వాసన వస్తుంటే అది పాడైపోయినదే.

Rotten Eggs కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా ఈ ట్రిక్‌తో ఇట్టే క‌నిపెట్టొచ్చు

Rotten Eggs : కుళ్లిన గుడ్డుని ఎలా గుర్తించాలో మీకు తెలుసా.. ఈ ట్రిక్‌తో ఇట్టే క‌నిపెట్టొచ్చు..!

నీటిలో ముంచే పరీక్ష.. ఓ పాత్రలో నీటిని తీసుకుని గుడ్డును ముంచండి. గుడ్డు పూర్తిగా నీటిలో మునిగితే బాగుంది. తేలితే లేదా నిటారుగా నిలిస్తే చెడిపోయినట్లే. గుడ్డును చెవి దగ్గర ఉంచి షేక్ చేయండి. లోపల ఎలాంటి శబ్దం లేకపోతే అది తాజా గుడ్డు. ఒకవేళ గుడ్డు నుంచి శబ్దం వస్తే, అది పాడైపోయినదని అర్థం. చెడిపోయిన గుడ్లను తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల గుడ్డులు తాజాగా ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది