Electric Bike : ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ మొత్తం తిరిగేయొచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Bike : ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ మొత్తం తిరిగేయొచ్చు…

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,7:00 am

Electric Bike : ఇప్పటికాలం చాలా మారిపోయింది. రోజురోజుకీ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. నిత్యజీవితంలో వాడేటివి కూడా శరీరానికి ఎక్కువగా పని చెప్పకుండా సులువుగా ఉండేలా ఎలక్ట్రిక్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మనవాళ్లు బయటకు వెళ్లాలంటే సైకిల్ మీద వెళ్లేవారు. అలా సైకిల్ ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండేది. సైకిల్ లేని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. కొన్నాళ్లకు ద్విచక్ర వాహనాలు వచ్చాయి. వీటి వలన సైకిల్ ను ఉపయోగించే వారి సంఖ్య తగ్గిపోయింది. పెట్రోల్ తో నడిచి వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ కాలంలో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. అయితే పెట్రోల్ రేట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాగే పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది.

అందుకే వీటికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లకు బాగా డిమాండ్ పెరిగింది. దీనివలన ఆటోమేకర్లు తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తక్కువ ధర నుంచి అధిక రేంజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. అందులో ఒకటే ఒకాయ కంపెనీ. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది. వీటి ద్వారా బ్యాటరీ రేంజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను తెలిపింది. ఒకాయన ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 72v,64Ah కెపాసిటీ లిథియం ఐయామ్ బ్యాటరీ ప్యాక్ కలదు. ఈ బ్యాటరీతో 1200w BLDC మోటార్ జత చేయబడింది. బ్యాటరీ చార్జింగ్ అనేది నాలుగు నుండి ఐదు గంటలు పూర్తిగా చార్జ్ అవుతుంది.

Electric vehicle and its cost praise

Electric vehicle and its cost praise

ఒకాయ ఫాస్ట్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 60kmph వేగంతో వెళ్లవచ్చు అని కంపెనీ తెలిపింది. ముందు మరియు వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేకులు పెట్టబడ్డాయి. దీంతో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను జోడించారు. ఈ స్కూటర్ ధర మార్కెట్లో రూ. 99,000 తో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు ఎక్కువ ఉన్నాయి. దీని వలన నిరుపేద ప్రజలు వీటిని కొనలేరు. అయితే రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరను తగ్గిస్తామని ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘట్కరి చెప్పారు. రెండేళ్లలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ధరలు సాధారణంగానే ఉంటాయి అన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది