Electric Bike: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు.. మరి ఆ బైక్ ఏదో..దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!

Electric Bike : ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు.. మరి ఆ బైక్ ఏదో.. దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!

 Authored By suma | The Telugu News | Updated on :23 January 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Electric Bike: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు.. మరి ఆ బైక్ ఏదో..దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!

Electric Bike : ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్నా ఎలక్ట్రిక్ బైక్ ola electric Bike కొనాలంటే ఆప్షన్లు మాత్రం ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఉన్న కొద్ది బైక్స్‌లో నిజంగా టాప్‌లో నిలిచేది ఏదంటే ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ అని చెప్పాల్సిందే. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ బైక్‌ను మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి తరచూ ఛార్జింగ్ పెట్టే టైమ్ లేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

Electric Bike ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు మరి ఆ బైక్ ఏదో దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Electric Bike : ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు.. మరి ఆ బైక్ ఏదో.. దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!

Electric Bike: 500 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త స్టాండర్డ్

ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ రేంజ్ విషయంలో భారత మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తోంది. 9.1kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ మోడల్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 నుంచి 501 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే మధ్యలో ఎలాంటి రేంజ్ టెన్షన్ లేకుండా లాంగ్ రైడ్స్ చేయవచ్చు. గంటకు గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ పరుగులు తీస్తుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో చేరుకోవడం దీని పవర్‌కు నిదర్శనం. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. స్పోర్ట్, నార్మల్, ఈకో అనే మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Electric Bike: మోడల్స్, ధరలు మరియు ఆదా లెక్కలు

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 9.1kWh మోడల్ ధర రూ.1,89,999 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు 4.5kWh బ్యాటరీతో వచ్చే మోడల్ ధర రూ.1,29,999గా ఉంది. చిన్న బ్యాటరీ మోడల్ ఫుల్ ఛార్జ్‌తో 252 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి సుమారు 6 గంటల ఛార్జింగ్ టైమ్ సరిపోతుంది. రోజూ సగటున 50 కిలోమీటర్లు ప్రయాణించే వారు 9.1kWh మోడల్ ఎంచుకుంటే నెలకు దాదాపు రూ.3,777 వరకు, ఏడాదికి రూ.45,000కి పైగా ఖర్చు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నారు.

Electric Bike: స్మార్ట్ ఫీచర్స్, ఫైనాన్స్ ఆప్షన్స్

ఈ బైక్‌లో ఆధునిక టెక్నాలజీకి కొదవలేదు. బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ సింగిల్ ఛానల్ ABS, ఇంటెలిజెంట్ రీజెనరేటివ్ ఎనర్జీ రికవరీ 4.3 ఇంచ్ LCD డిస్‌ప్లే, ఓలా MoveOS సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్, రిమోట్ ట్రాకింగ్, బిల్ట్-ఇన్ పార్కింగ్ అసిస్టెంట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు యూజర్లకు మరింత సౌకర్యం కల్పిస్తాయి. ఫైనాన్సింగ్ విషయానికి వస్తే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి ప్రముఖ బ్యాంకులు లోన్ సదుపాయాలు అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు 6.99 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కేవలం రూ.10,000 డౌన్‌పేమెంట్‌తో 60 నెలల పాటు నెలకు సుమారు రూ.3,563 ఈఎంఐ చెల్లించి ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. రేంజ్, ఫీచర్లు, ఆదా అన్నింటిలోనూ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు తోపు అనే చెప్పాలి.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది