YS Jagan : జగన్ చేసిన ఈ పని ఒక్కటి వర్క్ ఔట్ అయితే ..రిజల్ట్ తరువాత లెవెల్ లో ఉంటుంది
YS Jagan : ఏపీలో మరో సమస్య రాబోతోంది. సీఎం జగన్ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఎంతో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ ఉద్యోగ సంఘాలు.. సీఎం జగన్ కు మరోసారి హెచ్చరిక చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే వెంటనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, తమతో వచ్చే ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.
ఈసందర్భంగా మాట్లాడిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడుతామని తేల్చి చెప్పారు. పీఆర్సీ పెండింగ్ డిమాండ్లపై ఆర్థిక శాఖ అధికారులతో ఇటీవలే భేటీ అయ్యారు. గతంలో ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చిన హామీలను తేల్చాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సీపీఎస్ పై గతంలోనే సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
YS Jagan : సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు
కానీ.. దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. డీఏ చెల్లింపు జీవో కూడా ఇంకా అమలు కాలేదని సూర్యనారాయణ చెప్పుకొచ్చారు. డీఏ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని.. కానీ.. ఉద్యోగుల ఖాతాల నుంచి మాత్రం ఇన్ కమ్ టాక్స్ ను మినహాయించకుండా ఎందుకు టాక్స్ కట్ చేశారని ఆర్థిక శాఖ అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. అందుకే.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.