Epfo : పెన్షనర్లకు శుభవార్త ఇకపై నెల చివర్లోనే అకౌంట్లోకి డబ్బులు..!
Epfo : పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. పెన్షనర్ల ఇబ్బందులను గుర్తించిన ఈపీఎఫ్ఓ.. తాజాగా ఓ కొత్త విధానంను అమల్లోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సెక్టార్ లాగే ఇకపై ఈపీఎఫ్ఓ పెన్షనర్లు కూడా ప్రతి నెలా చివరి రోజున పెన్షన్ పొందేలా నిర్ణయం తీసుకోనుందట. ఈ మేరకు పింఛనుదారులు తమ పెన్షన్ కోసం ఇకపై ప్రతినెలా 1 లేదా 5వ తారీఖు వరకు వేచిచూడాల్సినవసరం ఉండబోదట. తాజా విధానంతో ఇకపై ప్రతీ నెల చివరన లేదా కొత్త నెల మొదలుకు 2 రోజుల ముందుగానే పెన్షనర్ల బ్యాంకు అకౌంట్లోకి నగదు జమ అయ్యేలా పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.
తక్షణమే పెన్షన్ ను పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలను జారీ చేయాలని రీజనల్ పీఎఫ్ ఆఫీసులకు ఆయన సూచించారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఈ తాజా విధానాన్ని ఈ నెల నుంచే అమల్లోకి తెచ్చేలా ప్రొవిజన్లు తీసుకొచ్చినట్టు తెలిపారు. పెన్షన్‌ను ఆలస్యంగా పొందడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై.. పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ ఓ… ప్రతి నెలా ముగింపునకు 2 రోజుల ముందుగానే బ్యాంకులకు రికన్సిలేషన్ స్టేట్‌మెంట్‌ను పంపేలా అన్ని ఏర్పాటు చేసుకోవాలని రీజనల్ కార్యాలయాలకు పీ ఎఫ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Epfo brings new system in pension scheme
Epfo : ఇకపై నెల చివరలోనే పెన్షన్..!
దీంతో పెన్షన్ అమౌంట్ బ్యాంకులకు చేరుకుని తద్వారా నెల ముగింపునకు రెండు రోజుల ముందే అనగా 30 వ తారీకు లేదా 31వ తేదీ నాడే పెన్షనర్ల డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.అయితే పాక్షికంగా అమలు లోకి తెస్తున్న ఈ విధానం… రెండు నెలల ఫలితాలు చూశాక, పూర్తిగా 100 శాతం దీన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ ఎట్టకేలకు నెరవేరుతుండటంతో లక్షలాది మంది పెన్షనర్లు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.