EPFO : పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే.. రూ.7 లక్షల ప్రయోజనాలు మీకే.. ఎలాగో తెలుసా?
EPFO : ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో పని చేసే వాళ్లకు పీఎఫ్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగుల, వాళ్ల ఫ్యామిలీ భవిష్యత్తు కోసమే పీఎఫ్ అకౌంట్ ను కేంద్రం తీసుకొచ్చింది. అయితే.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు.. వాళ్లు డిపాజిట్ చేసిన పీఎఫ్ డబ్బులతో పాటు.. చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ.. అవి చాలామందికి తెలియదు. పీఎఫ్ అకౌంట్ ద్వారా ప్రతి ఖాతాదారుడికి రూ.7 లక్షల ప్రయోజనాలు కలుగుతాయి. దాని కోసం ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్ ఉంటుంది.
దాన్నే ఈడీఎల్ఐ అంటారు. అది ఇన్సురెన్స్ స్కీమ్. ఇది ఈపీఎఫ్, ఈపీఎస్ తో కలిసి పని చేస్తుంది. ఈ స్కీమ్ కింద.. ఉద్యోగి మరణిస్తే.. అతడి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ ద్వారా డెత్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇన్సురెన్స్ స్కీమ్ ఆటోమెటిక్ గా అప్లయి అవుతుంది. దాని కోసం ప్రత్యేకంగా అప్లయి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగిగా ఉన్న సమయంలో.. పీఎఫ్ అకౌంట్ ఉండి మరణిస్తే.. 7 లక్షల రూపాయల వరకు ఉద్యోగి నామినీకి డబ్బును అందజేస్తారు.
EPFO : ఇన్సురెన్స్ స్కీమ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది?
అది సహజ మరణం అయినా.. ప్రమాదం అయినా.. లేక అనారోగ్యంతో మరణించినా వర్తిస్తుంది. కాకపోతే ఈ ఇన్సురెన్స్ స్కీమ్ కోసం ఫ్యామిలీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని కోసం పీఎఫ్ వెబ్ సైట్ కు వెళ్లి లాగిన్ అయ్యాక.. మేనేజ్ బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ ఉంది. దాంట్లో అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నామినేషన్ ప్రొసీజర్ ముగుస్తుంది. ఆ తర్వాత ఈ ఇన్సురెన్స్ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందొచ్చు.