ESI Jobs 2022 : ఈఎస్ఈలో 3800 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి పాస్ అయితే చాలు.. వెంటనే అప్లయి చేసుకోండి
ESI Jobs 2022 : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈఎస్ఐ సంస్థ తాజాగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ లో అప్పర్ డివిజనల్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రఫర్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లయి చేసుకోవచ్చు.
దీని కోసం ఇవాళే చివరి తేదీ. ఫిబ్రవరి 15 వరకే ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాల కోసం పదో తరగతి పాస్ అయిన వాళ్లు అప్లయి చేసుకుంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయిన వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.స్టెనోగ్రఫీ, యూడీసీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండాలి. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలి.

esic recruitment 2022 announced with ssc eligibility for 3800 posts
ESI Jobs 2022 : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి, స్టెనో కు ఇంటర్, యూడీసీ పోస్టులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి.మొత్తం ఖాళీలు 3820. అందులో యూడీసీ 1726, స్టెనోగ్రఫర్ 163, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 1931 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 72 పోస్టులు, ఏపీలో 35 ఖాళీలు ఉన్నాయి. ఇంకెందుకు అలస్యం.. వెంటనే ఈఎస్ఐ వెబ్ సైట్ లోకి వెళ్లి వెంటనే అప్లయి చేసుకోండి.