Big News : భట్టి విక్రమార్కతో ఈటల రాజేందర్ భేటీ.. కాంగ్రెస్ వైపు ఈటల అడుగులు..?
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఈటల రాజేందర్ భూవ్యవహారంలో చిక్కుకోవడం, ఆ తర్వాత ఆయన్ను మంత్రి వర్గం నుంచే తీసేయడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఈటల రాజేందర్ రాజకీయ కెరీర్ కు టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పుల్ స్టాప్ పెట్టింది. మెదక్ జిల్లా అచ్చంపేటలో 100 ఎకరాలు భూకబ్జాకు పాల్పడ్డారని ఈటల రాజేందర్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈటల రాజేందర్ దారి ఎటువైపు ఉందోనని అంతా భావిస్తున్న నేపథ్యంలో… ఈటల రాజేందర్ తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.

etela rajender meeting with bhatti vikramarka
తనను మంత్రి వర్గం నుంచి తొలగించాక.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. వేరే పార్టీలోకి వెళ్లడానికి కూడా ఈటల సమాయత్తమవుతున్నారని వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో.. ఈటల రాజేందర్ భేటీ అవ్వడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Etela Rajender : భట్టి విక్రమార్క, ఈటల మధ్య ఏ చర్చ జరిగింది?
తాజాగా ఈటల.. భట్టితో చాలా సేపు బేటీ అయ్యారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటనేది మాత్రం తెలియదు. ఇద్దరూ ప్రస్తుతం రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వీళ్లు రహస్యంగానే భేటీ అయినా.. మీడియాకు వీళ్ల భేటీ గురించి తెలిసింది. దీంతో.. ఈటల రాజేందర్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. తానే సొంతంగా పార్టీ పెట్టాలని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో… భట్టి సలహాలు ఏవైనా తీసుకొని ఉండొచ్చు.. ఈటల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతారు? ఒకవేళ ఆయన వేరే పార్టీలో చేరాలనుకుంటే.. బీజేపీలో చేరుతారు. కానీ.. ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు.. అంటూ మరో వార్త పొలిటికల్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది.