Etela Rajender : మరోసారి తిరగబడ్డ ఈటల రాజేందర్.. వెంటనే క్యాంప్ ఆఫీసుకు పిలిచిన కేసీఆర్.. అసలేం జరుగుతోంది?
Etela Rajender : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పార్టీ గురించి బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. సొంత పార్టీ నేతలే పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తుంటే… పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందోనని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
కట్ చేస్తే.. తాజాగా మరోసారి ఈటల రాజేందర్ తిరగబడ్డారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంకను సందర్శించిన ఈటల… అక్కడ హాట్ కామెంట్స్ చేశారు. పేదలను తమ కాళ్లపై నిలబడేలా చేసే పథకాలను ప్రభుత్వం తీసుకురావాలంటూ ఈటల వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ల వల్ల, కల్యాణ లక్ష్మి లాంటి పథకాల వల్ల ప్రస్తుతం ఉన్న పేదరికం పోదంటూ ఈటల వ్యాఖ్యానించారు.
ఈటల మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించగానే… వెంటనే మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే… మంత్రి ఈటలను తన కారులో క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో మంత్రి ఈటల భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగింది? ఈటల, కేసీఆర్ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్నది.
Etela Rajender : మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఈటలను పక్కన పెట్టిన కేసీఆర్
అయితే… ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ దూరం పెట్టారు. దీంతో ఈటల రాజేందర్ మరోసారి తిరగబడినట్టు తెలుస్తోంది. ఏకంగా తెలంగాణ సర్కారుపై, సర్కారు ప్రవేశపెట్టిన పథకాలపై ఈటల రాజేందర్ విమర్శలు చేయడంతో సీఎం కేసీఆర్… ఈటలతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం వీళ్లిద్దరి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కేసీఆర్, ఈటల మధ్య జరిగిన సమావేశంలో కేటీఆర్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి వ్యతిరేకంగా మాట్లాడటంతో… టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది… అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది.
మరోవైపు ఈటల రాజేందర్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత… టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆయనతో మాట్లాడటానికి సాహసించలేదు. కేవలం మంత్రి కేటీఆర్ మాత్రమే ఈటలతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఆయనను తన కారులోనే క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లారు.