etela rajender strong warning to gangula kamalakar
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. అదే ఈటల రాజేందర్ గురించి. మొన్నటి వరకు మంత్రిగా ఉండి.. వైద్యారోగ్య శాఖను హ్యాండిల్ చేసి.. కరోనా పోరులో తన వంతు పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మాజీ మంత్రి అయిపోయారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. రాత్రికి రాత్రే తెలంగాణలో రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఒక్క రోజులోనే అన్నీ రివర్స్ అయిపోయాయి. అన్నీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా మారిపోయాయి. ఆయన్ను భూకబ్జా వ్యవహారంలో ఆరోపించడం మొదలు.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వరకు అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. నువ్వా.. నేనా అన్నట్టుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఓవైపు టీఆర్ఎస్ నేతలు, మరోవైపు ఈటల రాజేందర్.. ఒకరినొకరు తెగ ఆడిపోసుకుంటున్నారు. ఇదంతా రాజకీయాల్లో కామనే కదా.. అని అనుకొని వదిలేద్దామన్నా.. దశాబ్దాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు అయిన ఈటల విషయంలో ఇలా ఎలా జరిగిందని తెలంగాణ ప్రజలు దీర్ఘాలోచనలో పడ్డారు.
etela rajender strong warning to gangula kamalakar
ఇక.. సీఎం కేసీఆర్ కూడా ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. హుజూరాబాద్ అంటేనే ఈటల కంచుకోట. ఆ కంచుకోటను బద్దలు కొట్టాలి కదా.. అందుకే.. డైరెక్ట్ గా కేసీఆర్ రంగంలోకి దిగి.. కంచుకోటను బద్ధలు కొట్టే బాధ్యతను గంగుల కమలాకర్ కు అప్పగించారు. గంగుల కూడా కరీంనగర్ కే చెందిన నేత కావడం.. మంత్రి కూడా కావడం.. గంగులకు, ఈటలకు పడకపోవడం.. కేసీఆర్ కు బాగా కలిసొచ్చింది. ఇక.. గంగుల తన పనిని హుజూరాబాద్ లో మొదలుపెట్టేశారు.
నయానో భయానో.. ఈటల రాజేందర్ వర్గీయులను మొత్తం.. గంగుల కమలాకర్.. టీఆర్ఎస్ అధిష్ఠానం చెంతకు చేర్చారు. అయితే.. కొందరు మాత్రం ఈటలతోనే ఉన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, జిల్లా నేతలు కొందరు మాత్రం ఈటలతోనే అని తేల్చి చెప్పారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీ నేతలు.. హైకమాండ్ మాట చెప్పినట్టు వినకపోతే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. హుజూరాబాద్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని సీఎం కేసీఆర్ తెగ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది.
అయితే.. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈటల రాజేందర్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. మంత్రి గంగుల కమలాకర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంగుల దూకుడు విషయం తెలుసుకున్న రాజేందర్.. ఆయనపై విమర్శలు గుప్పించారు. డైరెక్ట్ గా గంగుల పేరు ఎత్తకుండా.. గంగులకు భలే కౌంటర్ ఇచ్చారు ఈటల. బిడ్డా గుర్తుపెట్టుకో.. అధికారం శాశ్వతం కాదు.. ప్రజాప్రతినిధులను వేధిస్తున్నావు.. బిల్లులు ఇవ్వమంటూ బెదిరిస్తున్నావు.. 2023 తర్వాత నువ్వు ఉండవు. నీ చిట్టా నాకు తెల్వదా? మొత్తం విప్పుతా? నువ్వేందో.. నీ కథేందో అంతా తెలుసు. టైం వచ్చినప్పుడు నీ చిట్టా మొత్తం బయటపెడతా.. జాగ్రత్తగా ఉండు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే మసి అయిపోతవు… అంటూ ఈటల తీవ్రస్థాయిలో గంగుల కమలాకర్ ను హెచ్చరించారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.