Etela Rajender : రాజకీయాలు అంతే బాస్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రాజకీయాల్లో రాణించాలంటే… అన్నింటినీ తట్టుకునే ఓర్పు ఉండాలి. మన చుట్టు ఉంటూనే మనల్ని మోసం చేసేవాళ్లు ఉంటారు. అన్నింటినీ సరిగ్గా గమనించగలగాలి. ఎంతో మాటకారి అయి ఉండాలి. తమ్మిని బమ్మి… బమ్మిని తమ్మి చేయగలగాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించే చాన్స్ ఉంటుంది. లేదంటే పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. తాజాగా తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
పేరుకు ఆయన మినిస్టర్ అయినా కూడా టీఆర్ఎస్ హైకమాండ్ ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు అనే విమర్శ బాగా వినిపిస్తోంది. రెండుమూడు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానంపై, తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి ఈటల తన అసమ్మతి రాగాన్ని వినిపించిన విషయం తెలిసిందే. అందుకే… మంత్రి ఈటలతో మంత్రి కేటీఆర్ సమావేశమై… డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ తోనే ఈటలకు మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఆ మీటింగ్ లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు కానీ… కేసీఆర్ తో భేటీ తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి.మెయిన్ గా.. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు కేవలం ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసుకొనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయితే… ఇద్దరు మంత్రులు ఈటల, గంగుల.. ఇద్దరివీ వేర్వేరు వర్గాలుగా విడిపోయాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. దీంతో ఈటల వర్గం, గంగుల వర్గం మధ్య పోరు ఎక్కువైపోతోంది.
అయితే… డైరెక్ట్ గా ఈటలను దెబ్బకొట్టలేక… ఈటల అనుచరురాలు అయిన జెడ్పీ చైర్ పర్సన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమావేశమై… మహిళా జెడ్పీ చైర్ పర్సన్ ను దింపేందుకు ప్రయత్నిస్తున్నారట. సొంత పార్టీకి చెందిన సభ్యులే ఇలా సమావేశమై… ఈటల అనుచరురాలని టార్గెట్ చేశారంటే.. ఇదంతా కేవలం ఈటల మీద ఉన్న కోపమేనని… ఆయన్ను డైరెక్ట్ గా ఏం చేయలేక.. పొమ్మనకుండా పొగబెడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే… జెడ్పీ చైర్ పర్సన్ ను టార్గెట్ చేయడం వెనుక టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత హస్తం ఉందని టీఆర్ఎస్ పార్టీలోనే చర్చ జోరుగా సాగుతోంది.
కానీ.. ఫస్ట్ నుంచి ఆమెకు, జెడ్పీటీసీ సభ్యులకు పడటం లేదు. ఆమెను తప్పించి… వేరే వాళ్లను ఆమె ప్లేస్ లో కూర్చోబెట్టాలని జెడ్పీటీసీ సభ్యుల ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది. అందుకే… ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి.. 11 మంది జెడ్పీటీసీలు సిద్ధమయ్యారట. అయితే… ఈ విషయం మంత్రి ఈటలకు తెలియడంతో వెంటనే జెడ్పీటీసీలను అందరినీ హుజూరాబాద్ పిలిపించి… వాళ్ల సమస్యలు ఏంటో తెలుసుకున్నారట.ఒకే పార్టీకి చెందిన నేతపై ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టడం కరెక్ట్ కాదని.. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని ఈటల వాళ్లకు సర్దిచెప్పారట. కానీ… అదేమీ వర్కవుట్ అయ్యేలా లేదు. ఈటల మాటలను వినే పరిస్థితిలో వాళ్లు లేరు… అని తెలుస్తోంది. చూద్దాం మరి… మంత్రి అనుచరురాలిపై అవిశ్వాస తీర్మానం పెడతారా? లేక మంత్రి మాటకు గౌరవం ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.