KCR
KCR : కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విమర్శలు ఎక్కువ అయ్యాయి అనేది రాజకీయ వర్గాల విమర్శలు. ఇదే సమయంలో ఆయనకు సొంత పార్టీ నాయకుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. మంత్రి వర్గంలోని ఒక్కరు ఇద్దరు మంత్రులతో పాటు నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. వ్యతిరేక గళం వినిపిస్తున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయేమో అనే ఆందోళనతో కేసీఆర్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ ఛాణక్యుడిగా గుర్తింపు దక్కించుకున్న కేసీఆర్ కు ఈ చిన్న ఇంటి పోరు పెద్ద సమస్య కాదు. కాని సెంటిమెంట్ తో కూడిన ఇంటి పోరు వల్ల కాస్త ఇబ్బందులు తప్పవు అంటున్నారు.
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు తప్పవు. కొన్ని సార్లు సొంత పార్టీ నాయకులపై ఎత్తకు పై ఎత్తు వేయాల్సి రావచ్చు. పైకి బాగానే ఉన్న అవతల వారు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఆ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కేసీఆర్ తర్వాతే మరెవ్వరు అయినా అనడంలో సందేహం లేదు. అందుకే సొంత పార్టీలో ఉన్న ఇబ్బందులను మెల్లగా తొలగించుకుంటూ వస్తున్నాడు. వ్యతిరేకంగా ఉన్న వారిని పూర్తిగా దూరం పెట్టకుండా మెల్లగా ప్రాముఖ్యత తగ్గించడం వల్ల వారి ప్రాభవం పార్టీలో తగ్గుతుంది. తద్వారా తనకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడట.
KCR
పార్టీలో ఉన్న ఆ ఇద్దరు మంత్రుల విషయంలో కేసీఆర్ మొదటి నుండి సీరియస్ గా ఉన్నాడు. అయినా కూడా వారు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఏకంగా సీఎం కేసీఆర్ నే భయపెడుతున్నారు. కేసీఆర్ ప్రస్తుతానికి భయపడ్డట్లుగా నటిస్తున్నా తర్వాత తర్వాత వారిపై పంజా విసరడం మాత్రం పక్కా అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు తెలంగాణలో బలమైన రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా బలం ఉంది. ఆ బలం వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ ను అధికారంలోకి తీసుకు వచ్చి కేసీఆర్ ను సీఎం చేస్తుంది. కనుక ఆయన భయపడిపోతున్నాడు అనేది కేవలం పుకారే అనేది ఆయన మద్దతుదారులు బలంగా వాదిస్తున్నారు. అసలేం జరుగబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ (…
Actress : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్…
Kodali Nani : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.…
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం అద్భుతం.…
KTR : నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి Revanth reddy పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం బయటపడిందని…
Covid Positive : మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ..ఆసియా దేశాల్లో కోవిడ్ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.…
Struggling With Diabetes : నేటి ప్రపంచంలో డయాబెటిస్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే పెరుగుతున్న ప్రపంచ సమస్యగా…
Ice Apple : ఐస్ ఆపిల్స్‌ను పామ్ ఫ్రూట్, మరాఠీలో టాడ్గోలా, తమిళంలో నుంగు, గుజరాతీలో తారి, తెలుగులో ముంజలు…
This website uses cookies.