Janasena : జనసేన లోకి ఆ మాజీ మంత్రి జంప్.. ముహూర్తం ఎప్పుడంటే?
Janasena : ఏపీలో ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా జనసేన పార్టీ లేస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. 2019 ఎన్నికల్లో జనసేనను చులకన చేశారు కానీ.. 2024 ఎన్నికల్లో పరిస్థితులు మొత్తం మారిపోనున్నాయి. అందుకే చాలామంది నేతలు జనసేన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇతర పార్టీల నుంచి జనసేనకు జంప్ కొడుతున్నారు. తాజాగా ఓ మాజీ మంత్రి కూడా జనసేనలోకి జంప్ కొట్టబోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు.. అనేది తెలియదు కానీ..
ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని, త్వరలోనే జనసేనలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వైసీపీ పార్టీ కూడా ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని కంకణం కట్టుకుంది. ఈనేపథ్యంలో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య గట్టి పోటీ ఎదురు కానుంది. ప్రస్తుతం ఓ మాజీ మంత్రి మాత్రం జనసేన పార్టీలో చేరబోతున్నారట. ఆయన జనసేన పార్టీలో చేరితే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు. అసలు.. ఆయన జనసేన పార్టీలో చేరితే జనసేనకు ఇంకాస్త బలం పెరుగుతుందని అంటున్నారు. రాజకీయంగా ఆయనకు రాష్ట్రంలో చాలా పలుకుబడి కూడా ఉందట.
Janasena : జనసేనకు ఒక్కసారిగా పెరిగిన జన ఆదరణ
అందువల్ల ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చాలా ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ మాజీ మంత్రి ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నారంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉండనుందని అర్థం అవుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా మళ్లీ జనసేనలోనే చేరేందుకు చూస్తున్నారు. ఆయనకు అవకాశం వస్తే మళ్లీ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీలో చేరేందుకు ముఖ్య నేతలు కూడా ఆసక్తి కనబరుస్తుండటంతో జనసైనికులతో పాటు హైకమాండ్ కూడా ఖుషీ అవుతోందట. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.