AP Govt : చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ పై దుష్ప్రచారం.. అసలు నిజం ఏంటో తెలుసా? వీడియో
AP Govt : ఒకప్పుడు ఏదైనా విషయం జనాలకు తెలియాలంటే మీడియాలో రావాలి. అప్పుడే అందరికీ తెలిసేది. మరి.. ఈరోజుల్లో క్షణం పట్టదు.. ఏ విషయమైనా జనాలకు చేరడానికి. అవును.. దానికోసం మనం వాడుతున్నదే సోషల్ మీడియా అనే వెపన్. సోషల్ మీడియా ప్రభావం నేటి జనరేషన్ పై చాలా ఉన్నది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ అయినా అది పబ్లిక్ కు కనిపిస్తుంది. అంటే.. సోషల్ మీడియాలో ఏ విషయం షేర్ చేసినా అది జనాలకు చేరుతుంది అన్నమాట. ఎవరినైనా తిట్టాలన్నా.. విమర్శించాలన్నా డైరెక్ట్ గా అవసరం లేదు. సోషల్ మీడియా చాలు.
తాజాగా ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కొందరు సోషల్ మీడియానే వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో నిలబడ్డారు. చేతులు జోడించి నిలబడి అక్కడ రోడ్డు వేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. సీఎం జగన్ ను వేడుకుంటున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఆ వీడియోను తెగ హైలైట్ చేస్తున్నాయి. ఆ వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కావాలని ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తేల్చి చెప్పింది. అంతే కాదు..
AP Govt : వీడియో ఫేక్ అని తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్
సీఎంవో కార్యాలయం కూడా ఈ వీడియో వెనుక ఉన్న అసలు విషయాన్ని ఏపీ ప్రజలకు తెలియజేసింది. నిజానికి.. బలిఘట్టం శివారు లింగాపురం గ్రామానికి వెళ్లే దారిలో వరాహనదిపై ఇప్పటికే బ్రిడ్జి ఉంది. గ్రామం నుంచి ఈ బ్రిడ్జి ద్వారా వెళ్లొచ్చు. రోడ్డు కూడా బాగుంది. గ్రామస్థులు అందరూ ఇదే రోడ్డును వినియోగిస్తున్నారు. అసలు నదిలో దిగాల్సిన అవసరం లేదు అని సీఎంవో కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. గ్రామాన్ని, బ్రిడ్జిని మరింత దగ్గరగా కలుపుతూ కొత్తగా నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు కోసం భూములను కూడా సేకరిస్తున్నారు. భూసేకరణ పూర్తికాగానే త్వరలో రోడ్డును కూడా వేయనున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్న రోడ్డుకూ మరమ్మతులు నిర్వహించనున్నారు..అంటూ ఏపీ సీఎంవో అసలు నిజం బయటపెట్టింది. దీంతో ప్రతిపక్షాలు కళ్లు బైర్లుకమ్మేశారు.
In a heart-wrenching plea to Andhra Pradesh CM, tribal students of Lingapuram village staged a protest by standing with folded hands in the waters of the Varaha River, appealing to the authorities that a road be laid to their village.#AndhraPradesh #JaganMohanReddy #NewsMo pic.twitter.com/QVaSQYpg8u
— IndiaToday (@IndiaToday) October 19, 2022