Chandrababu : చంద్రబాబు కి జ్ఞానోదయమయ్యింది.. కానీ, లేటుగా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్రబాబు కి జ్ఞానోదయమయ్యింది.. కానీ, లేటుగా.!

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న తపనతో వున్నారు. ఎవరైనా రాజకీయాలు చేసేది అధికారంలోకి వచ్చేయాలనే ఆలోచనతోనే. సరే, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చెయ్యాలనే తపనతో జనసేనాని పవన్ కళ్యాణ్ వుంటారనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని పక్కన పెడదాం. ఇంతకీ, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయా.? చంద్రబాబు తిరిగి అధికార పీఠమెక్కేందుకు ఆస్కారం వుందా.? అధికారం సంగతి తర్వాత, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,6:30 am

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న తపనతో వున్నారు. ఎవరైనా రాజకీయాలు చేసేది అధికారంలోకి వచ్చేయాలనే ఆలోచనతోనే. సరే, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చెయ్యాలనే తపనతో జనసేనాని పవన్ కళ్యాణ్ వుంటారనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని పక్కన పెడదాం. ఇంతకీ, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయా.? చంద్రబాబు తిరిగి అధికార పీఠమెక్కేందుకు ఆస్కారం వుందా.? అధికారం సంగతి తర్వాత, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తెలుగు దేశం పార్టీకి అభ్యర్థులు వున్నారో లేరో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే తెలియని పరిస్థితి.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం చంద్రబాబుని రాజకీయంగా పతనం చేసింది. ఔను, రాజకీయాల్లో అనుభవం కారణంగా హుందాతనం వస్తుంది. చంద్రబాబుకి ఆ అనుభవం వల్ల హుందాతనం పోయింది. అడ్డగోలు విమర్శలు చేస్తూ వస్తుంటారు చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థుల మీద. రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.. కానీ, తాను ముఖ్యమంత్రి పదవిలో వుంటే కరోనా వచ్చేదా.? అని ప్రశ్నించడం లాంటి చేష్టలతో చంద్రబాబు సొంత పార్టీలోనే పలచనైపోతున్నారు. తాజాగా, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలన్నిటినీ కలిపి జిల్లాగా చేసేస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలవుతున్నాయి.

Eyes Are Open For Chandrababu But Too Late

Eyes Are Open For Chandrababu, But Too Late.!

2014 నుంచి 2019 వరకూ చంద్రబాబే అధికారంలో వున్నారు. అప్పటికి రాష్ట్రంలో వున్న జిల్లాల సంఖ్య 13 మాత్రమే. తన హయాంలో జిల్లాల సంఖ్య పెంచాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. అధికారంలోకి వస్తే లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడతామని వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పారు, మాటకు కట్టుబడి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచారు. పోలవరం జిల్లా విషయమై అక్కడి ప్రజానీకం కోరితే, జిల్లాగా ప్రకటించడం పెద్ద విషయమేమీ కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. సో, చంద్రబాబు ఈ విషయంలో కూడా బొక్క బోర్లా పడ్డారన్నమాట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది