YCP : జగన్ కి చాలా స్ట్రాంగ్ బలం ఇస్తూ.. టాప్ పారిశ్రామికవేత్త వైసీపీలోకి..!
YCP : ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. వచ్చేదంతా ఎన్నికల సీజనే కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఏపీలో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నాయి. అందుకే.. బలమైన నేతల కోసం అన్ని పార్టీలు వేటాడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అయితే వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నో వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ
పారిశ్రామికవేత్త వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట.ఆయన దివంగత రాజకీయ నేత కొడుకు. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఆయన బిజినెస్ లు ఎక్కువగా బెంగళూరులో ఉన్నాయి. ఆయన తండ్రి టీటీడీ చైర్మన్ గా పని చేశారు. ఎంపీగానూ పనిచేశారు. ఆయన తల్లి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ.. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేశారు. ఆయన పార్టీలోకి వస్తే బలిజ సామాజిక వర్గం వైసీపీ వైపు మళ్లుతుందని సీఎం జగన్ ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.
YCP : సీఎం జగన్ తో భేటీ అయిన ఆ పారిశ్రామికవేత్త
అందుకే.. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆ నేతను వైసీపీలో చేర్చుకోవడానికి సీఎం జగన్ కూడా సుముఖత చూపిస్తున్నారట. ఇటీవల ఆ పారిశ్రామికవేత్త.. సీఎం జగన్ తో భేటీ కూడా అయ్యారట. ఆయన కనుక వైసీపీలో చేరితే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న బలిజ సామాజిక వర్గం మొత్తం వైసీపీ వైపు మళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన వైసీపీలో చేరితే.. టీడీపీ, జనసేన కూటమికి పెద్ద దెబ్బ పడినట్టే. ఆ కూటమిని దెబ్బతీయడానికే ఏకంగా ఆ పారిశ్రామికవేత్తను సీఎం జగన్ లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది.