KCR Birthday : అపర చాణక్యుడు కేసీఆర్ పుట్టిన రోజు ఇక నుంచి రైతు దినోత్సవం..!
KCR Birthday: పట్టు పడితే విక్రమార్కుడు.. వ్యూహం రచిస్తే చాణక్యుడు.. రాజకీయాల్లో తిరుగు లేని నేత.. ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ మొత్తాన్ని ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఆయన.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకం కావాలని ప్రయత్నిస్తున్నారు. నేడు కేసీఆర్ పుట్టిన రోజు. 68 ఏండ్లు పూర్తి చేసుకున్న ఆయన.. నేడు 69వ ఒడిలోకి పడిపోతున్నారు. ఈ సందర్భంగా.. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దుబ్బాక లో పుట్టని ఆయన మొదటిసారి సిద్దిపేట నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తర్వాత రెండుసార్లు మంత్రిగా, స్పీకర్ గా, రెండు సార్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా, మరో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును టీఆర్ ఎస్ శ్రేణులు ఎంత గ్రాండ్ గా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఫిబ్రవరి 17ను ఇక నుంచి రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కేసీఆర్ పుట్టిన రోజు అంటే ఇక నుంచి రైతు దినోత్సవం అని ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
KCR Birthday : మంత్రి నిరజంన్ రెడ్డి ప్రకటన..!
ఇక మరోసారి సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు తన విజన్ మొత్తాన్ని పథకాల మీద పెట్టారు. ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు పక్కా ప్లాన్‌తో సిద్ధం అవుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఆయన ఏ మేరకు రాణిస్తారో అన్నది వేచి చూడాలి. ఇకపోతే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ద తెలుగు న్యూస్ తరఫున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.