KCR Birthday : అనితరసాధ్యుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
KCR Birthday : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆంక్ష.. కాంక్ష ఇప్పటిది కాదు. సుదీర్ఘ కాలం పోరాటం అధికారికంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం అనధికారికంగా వేల మంది ప్రాణత్యాగాలు చేయడంతో పాటు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో సాధించారు. సుదీర్ఘ కాల ఆయన పోరాటంతో కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం సాధించడంలోనే కాకుండా రాష్ట్ర అభివృద్దికి ఆయన ముందు ఉండి అడుగులు వేయిస్తున్నారు. వరుసగా రెండు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి కోసం చాలా చేశారు అంటూ ఆ పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్కరు అంటున్నారు. రైతుల కోసం రైతు బంధు నుండి మొదలుకుని పించన్ లు భారీగా పెంచడం వరకు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆజ్యం పోశారు.
KCR Birthday : సీఎంగా రైతు బాంధవుడు…
తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కూడా రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారు. తెలంగాణ రైతులు నీటి విషయంలో ఎప్పటి నుండే అన్యాయంకు గురి అవుతున్నారు. కృష్ణా గోదావరి నదులు పారుతున్నా కూడా నీటి విషయంలో తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందుకే కాలేశ్వరంతో పాటు పలు ప్రాజెక్ట్ లను కట్టి అపర భగీరధుడు అయ్యాడు. ఇక మిషన్ కాకతీయ కార్యక్రమంతో పదుల సంవత్సరాలుగా పూడికతో ఉన్న చెరువులకు జల కళ తీసుకు వచ్చాడు. రైతులకు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు దేశంలోనే అద్బుతంగా కీర్తించబడింది. అద్బుతమైన పథకాలను రైతుల కోసం తీసుకు వచ్చిన కేసీఆర్ అన్ని వర్గాల వారికి కూడా అండగా నిలిచారు.
KCR Birthday : మహిళలు, యువత కోసం కేసీఆర్…
మహిళ సంఘాలకు పెద్ద ఎత్తున నిధులు మరియు సంక్షేప పథకాలను అందించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఆయన ఎన్నో పథకాలతో యువతకు కూడా స్వయంగా వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కల్పించారు. ఇక ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 50 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. యువతకు అన్ని విధాలుగా మద్దతుగా నిలవడంతో పాటు కొత్తగా భారీ ఎత్తున ఉద్యోగాలు వేసేందుకు కూడా సిద్దం అవుతున్నారు. ఇక విద్యా రంగంలో అనూహ్యంగా మార్పులు తీసుకు వచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బంగారు తెలంగాణ తాలూకు ఫలితాలు కనిపిస్తున్నాయి.