Ragi Laddu : ఎంతో కండపుష్టి కరమైన ఈ రాగి లడ్డు ఈజీగా చేసుకోండి ఇలా..
Ragi Laddu : ఇప్పుడున్న జనరేషన్లో రోజువారీ జీవనశైలిలో మనం తీసుకునే ఆహారంలో ఎన్నో కల్తీ పదార్థాలు ఉంటున్నాయి కెమికల్స్ తో కూడుకున్న ఆహారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ ను తీసుకోవడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎన్నో జబ్బుల బారిన పడుతున్నాం.
మన పెద్దలు ప్రాచీనకాలంలో తీసుకునే ఫుడ్ లో ఎటువంటి కల్తీ ఉండేది కాదు అవే ఇవిజొన్నలు ,రాగులు, కొర్రలు ,సజ్జలు ఇలాంటివన్నీ తినేవారు. వారందరూ ఇప్పుడు చాలా బలంగా పుష్టిగా ఉన్నారు.
అలాంటి వాటితో మనం కూడా ఇప్పుడు ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదే ఈ రాగి లడ్డు
దీనికి
కావలసిన పదార్థాలు : 1) రాగులు 2) నెయ్యి3) మినప గుండ్లు 4) యాలకులు 5) జీడిపప్పు 6) బెల్లం మొదలగునవి.. రాగి లడ్డు తయారీ విధానం :స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో రాగులు ఒక కప్పు వేసి బాగా దోరగా వేయించుకొని తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో అరకప్పు మినప ఉండలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. వాటిని తీసి మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్ లో పోయాలి. తరువాత రాగులు కూడా మెత్తని పౌడర్ లాగా చేసి అదే బౌల్ లో పోసుకోవాలి.
తర్వాత పావు కేజీ బెల్లం తీసుకొని ముందు తురుముకోవాలి తర్వాత ఆ బెల్లాన్ని మనం ముందుగా చేసుకున్న పౌడర్ ని కొంచెం తీసుకొని బెల్లంతురుము ఈ ఈ రెండిటినీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన బెల్లం ముద్దగా కాకుండా అది కూడా పౌడర్ లాగా వస్తుంది ఈ మిశ్రమాన్ని మొత్తం అదే బౌల్లోకి తీసుకుని తర్వాత జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నె తిలో వేయించుకొని అదే బౌల్లో పోసుకోవాలి తర్వాత ఒక కప్పు నెయ్యి ని కొంచెం కొంచెం ఈ మిశ్రమంలో లో వేసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి అంతే ఎంతో సింపుల్గా రాగి లడ్డు రెడీ