Flash News : విద్యాసంస్థల సెలవులు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పటివరకంటే..?
Flash News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులను ఈనెల 8 నుంచి 16 వరకు ప్రకటించింది.
ఆదివారంతో పండుగల సెలవులు ముగుస్తుండటంతో మరోసారి జనవరి 30 వరకు పొడగిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.కొవిడ్ బారి నుంచి విద్యార్థులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటివరకు సైలంట్‌గా ఉన్న కొవిడ్ కేసులు ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు ఇంటికే పరిమితం కానుండగా.. ఆన్‌లైన్ క్లాసుల గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రోజులు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు పెరిగితే మాత్రం ఇది ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రేపు కరోనా పరిస్థితుల మీద కేబినెట్ మీటింగ్ ఉంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2022