Flipkart Mobile Offers | భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫోన్ డీల్‌లు ..సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Mobile Offers | భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫోన్ డీల్‌లు ..సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం!

 Authored By sandeep | The Telugu News | Updated on :17 September 2025,9:00 pm

Flipkart Mobile Offers | భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రతీ సంవత్సరం లాంటి బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్‌ను ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ గ్రాండ్ సేల్ ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు ముందుగా సెప్టెంబర్ 22 నుంచే డీల్స్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి.

#image_title

ఇప్పుడు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను పరిశీలిద్దాం

Poco X7 Pro 5G – సూపర్ పవర్ఫుల్ డీల్

ఆఫర్‌ ధర: ₹19,999

డిస్‌ప్లే: 6.67-అంగుళాల AMOLED, 2712 x 1220 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్

ప్రాసెసర్: MediaTek Dimensity 8400 Ultra

OS: Android 15 ఆధారిత HyperOS 2.0

బ్యాటరీ: 6,550mAh with 90W HyperCharge

విశేషం: గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బెస్ట్ బడ్జెట్‌ ఫోన్

Nothing Phone (3a) Pro – స్టైల్ + పనితీరు

ఆఫర్‌ ధర: ₹24,999 (ఎమ్ఆర్పీ ₹29,999)

డిస్‌ప్లే: 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED, 30-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్

ప్రాసెసర్: Snapdragon 7s Gen 3 (4nm)

కెమెరా: 50MP ప్రైమరీ

బ్యాటరీ: 5000mAh with 50W ఫాస్ట్ ఛార్జింగ్

OS: Android 15 ఆధారిత Nothing OS 3.1

విశేషం: స్లీక్ లుక్, క్లీన్వేర్ యూజర్ ఇంటర్ఫేస్‌

CMF Phone 2 Pro – బడ్జెట్‌లో బెస్ట్ డీలీ

ఆఫర్‌ ధర: ₹14,999 (ఎమ్ఆర్పీ ₹18,999)

RAM + స్టోరేజ్: 8GB + 128GB

డిస్‌ప్లే: 6.77″ FHD+ AMOLED, 1080×2392, 120Hz

ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Pro

OS: Android 15 with Nothing OS 3.2

బ్యాటరీ: 5000mAh with 33W ఫాస్ట్ ఛార్జింగ్ & 5W రివర్స్ ఛార్జింగ్

కెమెరా: 50MP రియర్ కెమెరా

విశేషం: బడ్జెట్‌ ధరలో ప్రీమియం ఫీచర్లు

వాటితో పాటు రోజువారీ డీల్స్, ఫ్లాష్ సేల్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఇలా ఎన్నో ఉన్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది