Home » Exclusive » Flipkart Sale Ac Bumper Offers
Exclusive

Flipkart Sale : స‌మ్మ‌ర్ బొనాంజా.. ఎసీ, రిఫ్రిజిరేటర్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌

Authored By
Sam C
The Telugu News | Updated on: March 22, 2022 8:00 pm
Advertisement

Flipkart Sale : స‌మ్మ‌ర్‌లో కొన్ని కంపెనీలు ప‌లు ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తుంటాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్‌లో త‌గ్గింపు ధ‌ర‌లు భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కూలింగ్ డేస్ సేల్‌ నడుస్తోంది. ఏసీలు , ఫ్రిడ్జ్‌లు , ఎయిర్ కూలర్లపై మంచి ఆఫర్లు ఉంచింది ఫ్లిప్ కార్ట్‌. ఇందులో ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. నేడు (మార్చి 22) ప్రారంభమైన ఈ కూలింగ్ డేస్ సేల్ ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే ఈ సేల్‌ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో ప్రొడక్టులను కొంటే 10శాతం వరకు అదనంగా డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ల్పిట్ ఇన్వర్టర్ ఏసీపై 46 శాతం ఆఫర్‌ ఉంది.

Advertisement

సాధారణంగా ఈ ఏసీ ధర రూ.61,990 కాగా.. సేల్‌లో ప్రస్తుతం రూ.32,999 ధరకు ఉంది. సింఫనీ 27 ఎల్ రూమ్ / పర్సనల్ ఎయిర్ కూలర్ పై 22 శాతం డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. సాధారణంగా దీని ధర రూ.7,499 కాగా.. కూలింగ్ డేస్ సేల్‌లో రూ.5,799కు అందుబాటులో ఉంది. ఈ కూలర్ 1650 చదరపు అడుగల ప్రాంతాన్ని కూల్ చేయగదు. 27 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. తక్కువ ధరలో రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే సామ్‌సంగ్‌ 192 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ మోడల్‌పై ఆఫర్‌ ఉంది. సాధారణంగా ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.15,590 కాగా 16 శాతం డిస్కౌంట్‌తో సేల్‌లో రూ.12,990కు అందుబాటులో ఉంది.

Flipkart Sale Ac bumper offers

Advertisement

Flipkart Sale : బంపర్ బొనాంజా..

ఆటోమ్‌బర్గ్ రెనెసా+ 1200mm బీఎల్‌డీసీ మోటార్ విత్ రిమోట్ 3 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్‌పై 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. సాధారణంగా ఈ సీలింగ్ ఫ్యాన్ ధర రూ.4,870 కాగా.. ప్రస్తుతం కూలింగ్ డేస్ సేల్‌లో రూ.3,482 ధరతో లభిస్తోంది. ఒనిడా 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ పై కూడా 42 శాతం ఆఫర్‌ ఉంది. ఈ AC సాధారణ ధర రూ.44,990 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌ కూల్ కూలింగ్ డేస్‌లో రూ.25,999కే అందుబాటులో ఉంది. కాగా, మరిన్ని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లపై కూలింగ్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు ఇస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి