Honeymoon : రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్ చేస్తా అని చెప్పిన భర్త ఆ తర్వాత అశ్లీల వీడియోలు తీసి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honeymoon : రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్ చేస్తా అని చెప్పిన భర్త ఆ తర్వాత అశ్లీల వీడియోలు తీసి..!

 Authored By kranthi | The Telugu News | Updated on :20 May 2023,9:00 pm

Honeymoon : పెళ్లి అనేది ఒక బంధం. భార్యకు భర్త మీద.. భర్తకు భార్య మీద ఉండాల్సిన ఒక నమ్మకం. ఇద్దరిలో ఏ ఒక్కరికి నమ్మకం లేకపోయినా ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఇద్దరూ సర్దుకొని తమ జీవితాన్ని ఆరంభించాలి. ఒకప్పుడు భార్యాభర్తల బంధం చాలా గొప్పది అని చెప్పుకునేవారు. ఇప్పుడు భార్యాభర్తల బంధం నీటి మీద నడిచే పడవ లాంటిది. అది ఎప్పుడు మునిగిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్య పెళ్లిళ్లు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. పెళ్లి అయిన కొన్ని రోజులకే భార్యాభర్తలు విడిపోతున్నారు.

ఈ మధ్య కోర్టులు కూడా క్షణాల్లో భార్యాభర్తలకు విడాకులు ఇచ్చేస్తున్నాయి. ఇక.. అదనపు కట్నాల వేధింపులు, పెళ్లయ్యాక భార్యను పలు విధాలుగా హింసించడం కూడా ఈ మధ్య పరిపాటి అయింది. ఇదే కోవకు చెందిన ఓ వ్యక్తి భార్యతో కాపురం చేయడానికి కూడా అదనపు కట్నం అడిగాడు. అదనపు కట్నం ఇస్తేనే తనతో సంసారం చేస్తా అన్నాడు.యూపీకి చెందిన ఓ వ్యక్తి పెళ్లయ్యాక తన భార్యతో కాపురం చేయడానికి, తనను హనీమూన్ కు తీసుకెళ్లడానికి మరో 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తప్పక ఒక రూ.5 లక్షలు ఇచ్చి ఎలాగోలా తన భర్తను ఒప్పించారు. దీంతో అదే డబ్బుతో ఇద్దరూ కలిసి హనీమూన్ కు వెళ్లారు.

for honeymoon with wife husband demands 10 lakhs

for-honeymoon-with-wife-husband-demands-10-lakhs

Honeymoon : యూపీకి చెందిన కీచక భర్త ఘాతుకం ఇది

హనీమూన్ లో భార్యతో సంసారం చేస్తున్నట్టు నటించి తన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటితో భార్య ఫ్యామిలీని బెదిరించాడు. మిగితా రూ.5 లక్షలు ఇస్తేనే లేదంటే.. సోషల్ మీడియాలో ఆ ఫోటో, వీడియోలను షేర్ చేస్తా అని బెదిరించాడు. వెంటనే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తన తల్లిదండ్రులను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త, అత్తమామల మీద కేసు పెట్టింది. అతడి మీద కేసు పెట్టిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది